SAKSHITHA NEWS

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.

*స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు.

*ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్

నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ అన్వేష్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని గాంధీ విగ్రహం సమీపంలోని స్పైసి ప్యారడైజ్ హోటల్ పై వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీ చేసి తాత్కాలికంగా మూసివేసామని అన్నారు. మధ్యాహ్నం తమ సిబ్బందితో పాటు, జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో కలిసి హోటల్ ను తనిఖీ చేశామని అన్నారు. హోటల్లో అపరిశుభ్రంగా ఉండడం, స్టాక్ వద్ద భారీ సంఖ్యలో బొద్దింకలు ఉండడం, సేఫ్టీ నమూనాలు పాటించకపోవడం గుర్తించామని అన్నారు. ఆ మేరకు ప్రతినెలా పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టాలని, గోడలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని, కిచెన్ నందు మూతలు కలిగిన పాత్రలు వాడాలని సూచించామని అన్నారు.

డస్ట్ బిన్లు ఏర్పాటు చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ సరైన పద్ధతిలో అమలు చేయాలని, వంట మనుషులు, పనిచేయువారు ఎలాంటి అంటూ వ్యాధులు లేకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించి సర్టిఫికెట్లు పొందాలని పొందాలని సూచించమని అన్నారు. స్టాకు కొన్నప్పుడు, వినియోగించినప్పుడు స్టాక్ రిజిస్టర్ మైంటైన్ చేయాలని నగరపాలక సంస్థ లైసెన్సులు ఫుడ్ లైసెన్సులు కనపడే విధంగా ఉంచాలని తెలిపామని అన్నారు. వినియోదారులకు నాణ్యమైన ఫుడ్ అందించాలని అన్నారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ హోటల్లో తీసిన ఆహార పదార్థాలు శాంపుల్స్ హైదరాబాదు ల్యాబ్ కి పంపామని, మూడు వారాల లోపల రిపోర్ట్స్ వస్తాయని అన్నారు. తనిఖీలు కనుగొన్న లోపాలను సరిదిద్దుకోవాల్సిందిగా నోటీసులు ఇచ్చామని అన్నారు. వారు హోటల్ నందు తనిఖీల్లో తెలిపిన లోపాలను సరిదిద్ది తిరిగి తెరుచుకునేందుకు అనుమతి ఇస్తామని హెల్త్ ఆఫీసర్ తెలిపారు. ఆయన వెంట శానిటరీ సూపర్ వైజర్స్ చెంచయ్య, సుమతీ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS