SAKSHITHA NEWS

పల్నాడు జిల్లా.

వినుకొండ పట్టణం

ఆకస్మికంగా సబ్ జైలు ను తనిఖీ చేసిన వినుకొండ జడ్జి.
ఏ. తౌషీద్ హుస్సేన్.

వినుకొండ సబ్ జైల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి ఏ.తౌషిద్ హుస్సేన్ , సబ్ జైలును సందర్శించి ఖైదీలతో సమావేశం నిర్వహించి అక్కడ ఉన్నటువంటి ఖైదీలను వారి యొక్క సమస్యలను ప్రశ్నించి వారి ఆరోగ్య పరిస్థితులను, జైలులో అందిస్తున్న భోజన సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు, జైలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేయాలి అని అడిగారు,జైలులో అందిస్తున్న మెనూను పరిశీలించారు. వైద్యం, భోజనం,తదితర విషయాల గురించి ఖైదీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జైల్ నుంచి విడదల అయిన తరువాత ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి అని, నేరాలకు దూరంగా ఉండాలి అని, సమాజంలో మంచి పౌరులుగా జీవించాలి అని తెలిపారు, భవిష్యత్తులో నేరాల జోలికి పోవద్దు అని తెలిపారు.వంటగదిని, స్టోర్ రూంని వండిన ఆహారంను తనిఖీ చేసి తగు సూచనలు చేసినారు.న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని వారికి న్యాయవాదిని నియమిస్తామని, ఎవరికైనా న్యాయ సహాయం కావాలంటే తెలియజేయాలి అని తెలిపారు, ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలి అనీ చెప్పారు. నేరాలకు దూరముగా ఉండాలి అని,జైలు నుంచి విడుదలైన తర్వాత కుటుబసభ్యులతో కలిసి ఆనందముగా జీవించాలి అని,ఖైదీ లందరూ సత్ప్రవర్తన కలిగి ఉండాలని న్యాయమూర్తి తెలిపారు. అనంతరం జైలు గార్డెన్ ను పరిశీలించారు.జైలు ప్రాంగణమును పరిశీలించి తగు సూచనలు చేసినారు.ఈ కార్యక్రమంలో న్యాయమూర్తి తో పాటు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరే సామ్రాజ్యం సీనియర్ న్యాయవాదులు. లు, పోలీసులు, జైలు సూపరింటెండెంట్ మధుసూదన్ రావు, కోర్టు సిబ్బంది,లోక్ అదాలత్ సిబ్బంది,జైలు సిబ్బంది, పాల్గొన్నారు,


SAKSHITHA NEWS