SAKSHITHA NEWS

వినుకొండ కేంద్రంగా బయో ఉత్పత్తులు అమ్మకాలు

75.24 లక్షల విలువైన బయో ప్రొడక్ట్స్ ను సీజ్

వినుకొండ:- పట్టణం, మరియు రూరల్ ప్రాంతాల్లో పలువురు ఎరువులు వ్యాపారులు యదేచ్చగా అనుమతులు లేని బయో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిర్వహించి రైతులను నట్టేట ముంచుతున్నారని… ప్రముఖ కంపెనీల పేర్లతో వినుకొండ కేంద్రంగా బయో ఉత్పత్తులు అమ్మకాలు జరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ కమీషనరేట్ కు ఫిర్యాదు ల నేపథ్యంలో… ఉన్నతాధికారుల ఆదేశాలతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు,స్ధానిక అధికారులతో కలిసి 3 ప్రత్యేక బృందాలు నియోజకవర్గంలో విస్తృతంగా తనిఖీ లు నిర్వహించారు… ప్రత్యేక అధికారుల తనిఖీలతో పలువురు ఎరువుల వ్యాపారులు తమ దుకాణాలకు తాళాలు వేసి వెళ్లిపోయారు… ఈ సంఘటనతో తలుపులు తీసి ఉన్న షాపుల వరకు అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సుమారు 4 లక్షల రూపాయల విలువైన ఎరువులు అమ్మకాలు నిలిపివేశారు… అనంతరం పట్టణ సమీపంలోని మార్కాపురం రోడ్డు, కోల్డ్ స్టోరేజ్ ఎదురుగా ఉన్న అనధికార గౌడౌన్ (నెం-44) లో బయో ప్రొడక్ట్స్ ఉన్నాయని గుర్తించి… పోలిస్ బందోబస్తు మధ్య గౌడౌన్ తాళాలు పగులగొట్టి చూడగా అందులో ఎటువంటి అనుమతులు లేని, అనధికారికంగా నిల్వ ఉంచిన బయో ఉత్పత్తులను గుర్తించారు… మార్కెట్ (ఏం ఆర్ పీ) విలువ ప్రకారం సుమారు 75.24 లక్షల విలువైన బయో ప్రొడక్ట్స్ ను సీజ్ చేసి కేసు నమోదు చేసి, వాటిని పట్టణంలోని లక్ష్మీ వెంకట శ్రీనివాస ట్రేడర్స్ కు అప్పగించినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు… అదేవిధంగా మరో రెండు బృందాలు బొల్లాపల్లి, ఈపూరు మండలాల్లో తనిఖీలు నిర్వహించి అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎరువులు, పురుగు మందులను అమ్మకాలను నిలుపుదల చేస్తూ, మరి కొన్నింటిని సీజ్ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

కోసమెరుపు మరియు ఆశ్చర్యం కలిగించే విషయం:- అనుమతులు లేని బయో ప్రొడక్ట్స్ అమ్మకాలు నిర్వహించ కూడదని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా, బయో ప్రొడక్ట్స్ అమ్మకాలు చేసే వ్యాపారులకు… కొందరు ఎరువులు వ్యాపారులు సహకరిస్తుడం తనిఖీలకు వచ్చిన అధికారులు ఇదేమి విడ్డూరం అని ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు సమాచారం.


SAKSHITHA NEWS