వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ లో గల వినాయక పార్క్ లో సీనియర్ సిటీజన్స్ మరియు యోగ భవనం కు వచ్చే వారి సౌకర్యార్థం కోసం PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ స్వంత నిధులతో రూ. 5 లక్షల రూపాయల అంచనావ్యయం తో నిర్మించిన లిఫ్ట్ ను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ యోగ కోసం వచ్చే వారికి, మహిళలకు ,సీనియర్ సిటిజన్ వాళ్ళ సౌకర్యార్థం లిఫ్ట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అని , వారి సౌకర్యార్థం కోసం నా స్వంత నిధులతో రూ. 5 లక్షల రూపాయలతో లిఫ్ట్ ఏర్పాటు చేయడం జరిగినది అని దానిలో భాగంగా లిఫ్ట్ ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది అని, మహిళలకు, సీనియర్ సిటీజన్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, సీనియర్ సిటీజన్స్ కోసం అన్ని రకాల మౌలిక వసతులు కలిపిస్తామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. లిఫ్ట్ సౌకర్యార్థం వలన మెట్లు ఎక్కకుండా సులువుగా ఉంటుంది అని, లిఫ్ట్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులో కి తీసుకువచ్చామని ,లిఫ్ట్ ను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఏ చిన్న సనస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సంజీవ రెడ్డి, ప్రసాద్, రాంచందర్, నాని, చంద్రమోహన్ సాగర్, లింగయ్య, రాధాబాయి, వెంకటేశ్వర్లు, సుదర్శన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.