SAKSHITHA NEWS

మల్కాజ్గిరి లో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు…

సాక్షిత మల్కాజ్ గిరి : చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి నిర్వహించుకునే పండుగలలో మొదటి పండుగ వినాయక చవితి..

మల్కాజిగిరిలో గల్లి గల్లి లో కొలువైన గణనాథుడు.. మల్కాజ్గిరిలోగల స్వయంభు సిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ఆలయంలో గణనాధుని ప్రతిష్టించి ఎంతో అంగరంగ వైభవం భక్తుల మధ్య స్వామి వారికే పూజా కైంకర్యాలను నిర్వహించారు.. ఆయా కమిటీ సభ్యులు భక్తులు పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు..

శ్రీ సాయిబాబా ద్వారకామాయి సంస్థ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా స్వామి వారిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు… పిల్లలు పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పూజ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు


SAKSHITHA NEWS