బంటుమిల్లి మండలం నాగేశ్వరావుపేట, మల్లేశ్వరం గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొని సిమెంట్ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ .
ఎమ్మెల్యే శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ నాగేశ్వరావుపేట పంచాయితీలో రైతు భరోసా కేంద్రం, సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు
గ్రామాల్లో జరిగిన పల్లె పండుగ సభల్లో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ ఐదేళ్ల పాటు రాక్షస పాలన చూసిన ప్రజలు…….నేడు కూటమి ప్రభుత్వ ప్రజాపాలన చూస్తున్నారాన్నారు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కష్టపడతానని పేర్కొన్నారు.
రాబోవు ఐదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడమే లక్ష్యంగా పని చేస్తానని….. ముఖ్యంగా ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం…….రోడ్ల అభివృద్ధిపై దృష్టి పెడతానని పేర్కొన్నారు
రాష్ట్రంలో కుప్ప కూలిన వ్యవస్థలను గాడిలో పెడుతూ……. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిరంతరం పనిచేస్తున్నారని కూటమి పార్టీల నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మహాకూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు గ్రామస్తులుతదితరులు పాల్గొన్నారు.