SAKSHITHA NEWS

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని ఎల్వోపీ మధుసూదనా చారి, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి పరామర్శించడం జరిగింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..

వికారాబాద్‌ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారుమంచి ఆసుపత్రికి పంపకుండా హాస్టల్ లో ఉంచి వారికి చికిత్స అందించారు.

నాలుగు రోజులు గడించింది. అయినా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదు. విద్యార్థిని లీలావతిని నిమ్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి..మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్ పై ఉండటం చూస్తే మనస్సు కలిచివేస్తున్నది. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.

ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నది. వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స


SAKSHITHA NEWS