SAKSHITHA NEWS

వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై దాడి నిరసన

శంకర్పల్లి : :వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులపై ఇటీవల జరిగిన దాడి, అప్రజాస్వామ్య చర్యగా భావించి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసన కార్యక్రమం శంకర్ పల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఉద్యోగులు నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో సెక్రటరీస్ ఫోరం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ch శ్రీకాంత్ గౌడ్, పంచాయతీ కార్యదర్శులు శేషగిరిరావు, ఉపాధి హామీ ఉద్యోగులు మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా, ప్రభుత్వం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS