బీసీ సంక్షేమఅధికారిగా విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు
సాక్షిత : కొత్తగూడెం జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా పి, విజయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె జిల్లా కలెక్టర్ జితేష్జి వి, పాటిల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఇప్పటివరకు ఈ విధులను నిర్వహించిన ఇందిర భూపాలపల్లి కి బదిలీ అయ్యారు. గతంలో బీసీ అభివృద్ధి అధికారిగా పనిచేసిన విజయలక్ష్మి పదోన్నతి పొంది బీసీ సంక్షేమ అధికారిగా నియమితులయ్యారు.
