SAKSHITHA NEWS

పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

సాక్షిత :- ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి

ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. కోవూరు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజా సమస్యలు ఆలకించారు. వివిధ శాఖలకు సంబంధిన మండల స్థాయి అధికారులు తమ శాఖల పరిధిలో జరిగే కార్యకలాపాలకు సంబంధించి వివరాలను సభలో ప్రస్తావించారు. మినీ అసెంబ్లీ సమావేశాలను తలపించేలా జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలు సంస్ధాగత సమస్యలపై స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులను ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణాలలో జరిగిన అవినీతి, అక్రమాలపై సమాధానం చెప్పాలని లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజ గోపాల్ రెడ్డి హోసింగ్ ఏ ఇ పై ప్రశ్నల వర్షం కురిపించారు. గుంతలమయమై వున్న రోడ్ల దుస్థితి మరియు ఆక్రమణలు, అనధికార విద్యుత్ కోతలపై సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులు సమాధానం చెప్పాలని సభ్యులు పట్టు పట్టారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జోక్యం చేసుకొని సభ్యులను శాంతింప చేశారు.మండల సాగునీటి రంగ పురోగతి వివరిస్తూ నవంబర్ 1 వ తేదీన జరిగే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం అనంతరం కలెక్టర్ ఆదేశాల తరువాత రైతాంగానికి నీళ్లు విడుదల చేస్తామన్న ఇరిగేషన్ ఎఇ ప్రకటించడంతో సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అవసరమైతే తాను కలెక్టర్ తో మాట్లాడుతానని కోవూరు నియోజకవర్గ పరిధిలోని 12, 500 ఎకరాలకు ముందుగా సాగు నీరు విడుదల చేయాలని ఆదేశించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ కీలకమైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఆరోగ్యం, విద్య, ఇరిగేషన్, విద్యుత్, వ్యవసాయం తదితర శాఖలకు చెందిన అధికారులలో చాలా మంది బదిలీలలో భాగంగా కొత్తగా వచ్చి వున్నారని స్థానిక పరిస్థితులపై అవగాహన పెంచుకొని స్థానిక నాయకులతో సమన్వయం చేసుకొని పని చేయాలని సూచించారు. ప్రజలతో మమేకమై ప్రభుత్వం గ్రామీణ ప్రాంత రైతులు సబ్సీడీలు, పేదలకు లబ్ది చేకూర్చే పధకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రాజకీయాలనేవి ఎన్నికల వరకేనని ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలలో అధికారులతో సహకరించాలని వైసిపికి చెందిన ప్రజా ప్రతినిధులకు హితవు పలికారు పార్టీలు గతీతంగా ప్రజలే మనకు ముఖ్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మల పార్వతి, జెడ్పిటిసి శ్రీలత, తహసీల్దార్ నిర్మలానంద బాబా, ఎంపిడిఓ శ్రీహరి రెడ్డి, కోవూరు సర్పంచ్ యాకసిరి విజయ, వేగూర్ సర్పంచ్ కరెటి అమరావతి, దారపనేని శ్రీనివాస్ నాయుడు, విన్నకోట రాఖి, పెంచలయ్య సూరిశెట్టి శ్రీనివాసులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, సునీల్ రెడ్డి, అశోక్ రెడ్డి, నాగరాజు ఎంపీటీసీ, పాలూరు వెంకటేశ్వర్లు, బెల్లంకొండ విజయ్, మైనార్టీ నాయకులు ఎస్.కె జమీర్, జహంగీర్, జనసేన నాయకులు శ్రీనివాసరెడ్డి, ఆల్తాఫ్, బిజెపి నాయకులు సుబ్బారావు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS