వేమిరెడ్డి దంపతుల గొప్ప మనసు
సాక్షిత :- శ్రీవారి సేవకులైన టీటీడీ ఉద్యోగులకు వస్త్ర బహుకరణ
టిటిడి సిబ్బందికి వస్త్ర వితరరణ చేసి మరో సారి వేమిరెడ్డి దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి సేవలో పాల్గొంటున్న వేలమంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వస్త్ర బహుకరణ చేశారు. శనివారం ఎంపీ వేమిరెడ్డి దంపతులు.. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా టీటీడీ సిబ్బంది, వేద పండితులు, వాహన బేరర్స్, అర్చకులు, లడ్డూ పోటు వర్కర్స్, కల్యాణకట్టలో విధులు నిర్వహించే సిబ్బంది, అలాగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటున్న ఇతర విభాగాల సిబ్బందికి వారు వస్త్రాలు అందించారు. తమ సేవలు గుర్తించి ఏటా వస్త్ర బహుకరణ నిర్వహిస్తున్న వేమిరెడ్డి దంపతులకు ఆయా విభాగాల ఉద్యోగులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
