జీఎస్టీ తగ్గింపుతో సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
“కేతంరెడ్డి వినోద్ రెడ్డి”
…..
సాక్షిత : నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు జీఎస్టీ 2.0 సంస్కరణల వలన కలిగే ప్రయోజనాలపై గత ఐదు రోజుల నుంచి నెల్లూరు నగర ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కేతంరెడ్డి వినోద్ రెడ్డి నవాబుపేట ప్రాంతంలో పర్యటించారు. స్థానిక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం నవాబు పేట ప్రాంతంలోని స్థానికులు మరియు వ్యాపారస్తులతో జిఎస్టి 2.0 వలన కలిగే ప్రయోజనాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణలతో దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొందన్నారు. జీఎస్‌టీ తగ్గింపుతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. దీనిద్వారా ప్రజల పొదుపు పెరుగుతుందని పేర్కొన్నారు. గతంలో నాలుగు స్లాబులుగా ఉన్న జీఎస్‌టీ.. నేడు 2 స్లాబులకు తీసుకురావడం పట్ల వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటికి జీఎస్టీ ప్రతిఫలాలు అందించేందుకు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, సీఎం చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, ఎంపీ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ జీఎస్టీ సంస్కరణల అమలుకు సంపూర్ణ మద్దతు తెలియజేసిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వై.కోటేశ్వరరావు , ఆర్. హరిబాబు , జాన్ డేవిడ్, జనసేన నాయకులు గుడి హరి కుమార్ రెడ్డి, ముడూరి కనకేశ్వర రావు,అంచల సారథి, కే.లక్ష్మి నారాయణ , వై.నీరజ్,యస్. వసంత్, కుక్క ప్రభాకర్, చైతన్య, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
