కల్పవృక్ష వాహనంపై విహరించిన శ్రీవారు
సాక్షిత : – వాహన సేవలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడుకొండల స్వామి వాహన సేవలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. స్వామి వారు రోజుకోక వాహనంపై తిరుమాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఉదయం స్వామి వారు కల్పవృక్షవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారు. క్షీరసాగర మదనంలో పాలసముద్రంలో ఉద్భవించిన దివ్యమైన వృక్షం కల్పవృక్షం. కోర్కెలు తీర్చే వాహనంగా భక్తులు విశ్వసిస్తారు. మనిషిలో ఉండే పాపాలు పోయి మంచి కలగాలనే సంకల్పంతో భగవంతుడి వద్దకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో కల్పవృక్ష వాహన సేవను దర్శించుకుంటారు.
