వాహన పన్నులు తప్పనిసరిగా కట్టాలి
సాక్షిత నంద్యాల జిల్లా డోన్
రాష్ట్రవ్యాప్తంగా అధికారుల ఆదేశాల మేరకు పన్ను కట్టని వాహనాలపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాహనాలపై వున్న పన్నులను తప్పనిసరిగా అందరూ కట్టాల్సిందే డోన్ ఆర్టీవో ఆఫీస్ పరిధిలోని డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల నుంచి 750 వాహనాలకు పన్నులు చెల్లించవలసి ఉండగా అందులో 394 వాహనాలకు పన్నులు చెల్లించడం జరిగింది. మిగిలిన 356 వాహనాలు తప్పనిసరిగా పన్నులు చెల్లించాలి అయితే కొందరు వాహనాలను కొన్ని రకాల కారణాలను చెబుతున్నారు అందులో మొదటిది ఇతరులకు అమ్మడం జరిగిందని చెబుతున్నారు అలా అమ్మకం చేసినప్పుడు నేమ్ ట్రాన్స్ఫర్ తప్పనిసరిగా ఉండాలి అది లేనియెడల వాహనంపై ఉన్న పన్నులు యజమాని కట్టవలసి వస్తుంది లేదా ఆ వాహనంతో ఏదైనా చట్ట వ్యతిరేకమైన పనులు నిర్వహిస్తే వాహన యజమాని శిక్షార్హులవుతారు. రెండవది మరికొందరు వాహనాలను నడపడం లేదని చెబుతున్నప్పటికి పన్నును విధిగా చెల్లించవలసిందే ఒకవేళ మీరు వాహనాన్ని నిలుపుదల చేసినట్లయితే మీ సమీప ఆర్టీవో ఆఫీస్ నందు స్టాప్ ఏజ్ కు తప్పనిసరిగా అప్లై చేయవలెను అధికారులు వాటిని పరిశీలించిన పిదప మీ వాహనం స్టాపేజీలో ఉన్నట్లు ధ్రువీకరించి స్థాపేజీలో ఉన్నన్ని రోజులు పన్ను మినహాయింపు ఇస్తారు.
మూడవది కొందరు గుజిలీకి వేసామని చెబుతున్నారు మాకు ఎటువంటి సమాచారం లేకుండా వాహనాలను గుజిలీకి వేస్తే ఆ వాహనాలకు పన్నులు తప్పనిసరిగా చెల్లిస్తూనే ఉండాలి. పన్నుల నుంచి మినహాయింపు కావాలి అనుకుంటే గుజిలీకి వాహనాన్ని వేసినట్లు గుజిలీ యాజమాన్యం దగ్గర ఒక ధ్రువపాత్రాన్ని ఆర్టీవో కార్యాలయం నందు తప్పనిసరిగా అందించవలసి ఉంటుంది వాటిని పరిశీలించిన పిదప వాహన ఆర్సి దృపత్రాన్ని క్యాన్సల్ చేయడం జరుగును. అయితే గుజిలీకి వేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పనులను తప్పనిసరిగా చెల్లించవలసిందే. ఒకవేళ వాహనం మా సాధారణ తనిఖీలలో చిక్కినట్లయితే వాటికి రెండు వందల శాతం పన్నును చెల్లించవలసి వస్తుంది.