కళాకారులకు పుట్టినిల్లు వనపర్తి
ప్రతిభ గల కళాకారులను రేపటి తరానికి పరిచయం చేయడమే సాహితీ కళా వేదిక లక్ష్యం……. సాహితి కళావేదిక అధ్యక్షులు శంకర్ గౌడ్
సాక్షిత వనపర్తి :
వనపర్తి కళాకారులకు పుట్టినిల్లు అని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు.శనివారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో ఆర్ డి ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో ప్రపంచ కళాకారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ అనాదిగా కళలను కళాకారులను సముచిత రీతిలో ఆదరించి గౌరవించిన సంప్రదాయం వనపర్తి జిల్లాలో ఉందని ఆ వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నoదుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు.వివిధ రంగాలలో ప్రతిభ గల కళాకారులను రానున్న కాలంలో ఒక వేదికపైకి తీసుకు వస్తామని వారిని ఇప్పటి తరానికి పరిచయం చేసే కార్యక్రమాన్ని చేపడతామని శంకర్ గౌడ్ వివరించారు.ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులైన వల్లభాపురం శ్రీనివాస్,గుడిసె శివలింగం, చీర్ల నాగేంద్రం సాగర్,ఉండేకోటి కృష్ణయ్య,మీసాల రాము,డప్పు సువర్ణ,మల్లెపు రాధ,నందిమల్ల నాగరాజు,మొగిలి రామక్రిష్ణ తదితరులను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈనాటి కార్యక్రమంలో ఆర్డిఎస్ సంస్థ నిర్వాహకులు చిన్నమ్మ థామస్,బైరోజు చంద్ర శేఖర్,సత్తార్,గంధం నాగరాజు, బండారు శ్రీనివాస్,డప్పు స్వామి,శాంతన్న,వెంకటస్వామి, విష్ణువర్ధన్ గౌడ్,శ్రీలక్ష్మీ,కవిత,కల్పన,బాలేమయ్య,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
