నాలాకు అంకుర హోమ్స్ కు ఎటువంటి సంబంధం లేదు
ప్రకృతిని మార్చడం ఎవరి వల్లా సాధ్యం కాదు: అంకుర హోమ్స్ అధినేత జైపాల్ రెడ్డి.
….
సాక్షిత శంకర్పల్లి : అంకుర హోమ్స్ నాలాను మార్చారని వచ్చిన కథనాలలో అంకుర హోమ్స్ కు ఎటువంటి సంబంధం లేదని అంకుర హోమ్స్ అధినేత జైపాల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రోజున కొన్ని పత్రికలలో అంకుర హోమ్స్ పై కొన్ని తప్పుడు కథనాలు వచ్చాయని, ఫతేపూర్ సర్వేనెంబర్ 23,24 లలో గల నాలను తాము మార్చామని తమ ప్రక్కన గల భూ యజమానులు మాట్లాడడంలో ఎటువంటి నిజం లేదని అన్నారు. తాము రైతుల నుండి భూమి కొనుగోలు చేయకముందే ఎన్నో సంవత్సరాల నుండి అక్కడ నాలా ఉందని వారు తెలిపారు. గూగుల్ ఎర్త్ లో గత 20 సంవత్సరాల నుండి నాలా దిక్సూచులు ప్రస్తుతం ఉన్న స్థలం లోనే ఉందని అన్నారు. తాము భూమి కొనుగోలు చేసిన రైతులు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఉన్నారని, వారు ఉన్నప్పుడే నాలా ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పుడు ఉన్న స్థలంలోనే ఉందని తమ భూమిపక్కల గల రైతులు కూడా చెప్పారని అన్నారు. ప్రకృతి మార్చడం ఎవరివల్ల సాధ్యం కాదని తెలిపారు. గతంలోనే ఈ విషయంపై ఇరిగేషన్ అధికారులు రికార్డులు పరిశీలించి, నాలా ఇక్కడే ఉందని తేల్చి చెప్పారని అన్నారు. తమ హోమ్స్ ముందు గల ప్రధాన రోడ్డుపై ఆర్ అండ్ బి అధికారులు క్రింది నుండి కల్వర్టు కూడా నిర్మించారని అన్నారు.తాము విల్లాలు కట్టే ముందు రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారుల నుండి కావలసిన చట్టపరమైన అన్ని అనుమతులు కూడా తీసుకున్నామని తెలిపారు. తమ దగ్గర నాలాకు సంబంధించి పూర్తి ఆధారాలు ఉన్నాయని, కానీ తమపై ప్రక్కనగల రైతులు కావాలని తమను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. ఒక నాలను మార్చడం అంటే ప్రకృతిని మార్చడమే అని తెలిపారు.నాలాను మేము మార్చడం అనడం విడ్డూరంగా ఉందని అన్నారు. మా మీద కావాలని లేనిపోని అభియోగాలు మోపుతున్నారని, మేము పక్కా ఆధారాలతోనే, రికార్డులతోనే ఉన్నామని తెలిపారు. మేము దీనిపై న్యాయపోరాటం చేస్తామని అన్నారు.
