రాష్ట్రాభివృద్ధి జగన్ రెడ్డికి నచ్చదా…?
** టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్
సాక్షిత ప్రతినిధి – చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దుబాయ్, అరబ్ దేశాల పర్యటన జైత్రయాత్రలా సాగడంతో రాష్ట్రం అభివృద్ధి చెందడం వైఎస్ జగన్ రెడ్డికి నచ్చదా…?? అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ప్రశ్నించారు. సాయంత్రం చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో వెంకిటీల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యూఏఈ పర్యటన, మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన
జైత్రయాత్రలా సాగింది.
అయితే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి , వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాష్ట్రాభివృద్ధే అజెండా..
ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషి
చేస్తుంది. ఓవైపు సీఎం యూఏఈలో పెట్టుబడి వేట కొనసాగిస్తుంటే… మరోవైపు లోకేష్ ఆస్ట్రేలియాలో రాష్ట్రానికి
పెట్టుబడుల జాతర తీసుకువచ్చేందుకు శ్రమిస్తున్నారు. వీరు పడుతున్న శ్రమ వలనే నేడు
విశాఖకు 15 బిలియన్ డాలర్లతో ఏఐ సిటీ ఏర్పాటుకు గూగుల్ ముందుకొచ్చింది. వైసీపీ 5 ఏళ్ళ పాలనలో చేయలేని అభివృద్ధి, తీసుకురాలేనన్ని పెట్టుబడులు, పరిశ్రమలను చంద్రబాబు
నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్నది. ప్రజల ఆశయాల సాధన కోసం, ఉద్యోగ సృష్టి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కూటమి ప్రభుత్వం ప్రతీరోజూ కృషి చేస్తోంది. కానీ ప్రజలకు మంచి జరగడం ఇష్టం లేని వైసీపీ.. ప్రభుత్వంపై
బురద జల్లడమే ద్యేయంగా , పనిగా పెట్టుకుంది. ఆంధ్రప్రదేశ్ ను భారత్ లోనే కాదు ప్రపంచ పెట్టుబడుల గమ్యంగా మార్చడమే లక్ష్యంగా సీఎం
యూఏఈ పర్యటన సాగింది. మన రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనువైన వాతావరణాన్ని వివరించి ప్రముఖ
పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. దుబాయ్, అబూదాబీ వంటి దేశాల్లో పర్యటించి రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, హౌసింగ్ రంగాల్లో
పెట్టుబడి అవకాశాలపై అనేక కంపెనీల ప్రతినిధులతో చర్చించారు.
షరఫ్ గ్రూప్, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, బుర్జీల్ హోల్డింగ్స్, మస్టార్, అగ్రియా, లులూ
వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులతో లాజిస్టిక్స్, ఆరోగ్యరంగం, షిప్బిల్డింగ్, మైనింగ్
రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై మాట్లాడారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
