వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు: డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ సమరం రెడ్డి

Police officers interacting with individuals at a roadside location at night.

Sakshitha news

వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా నడిపితే కఠిన చర్యలు: డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ సమరం రెడ్డి

శంకర్‌పల్లి: అక్టోబర్ 25: (సాక్షిత): వాహనాదారులు తమ వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా రోడ్ల పైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్‌ సమరం రెడ్డి హెచ్చరించారు. శనివారం శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డులో డిఐ తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఐ సమరం రెడ్డి మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా వాహనాలను నడిపితే చర్యలు తీసుకుంటామన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి కలిగి ఉండాలని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వరాదని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలని కోరారు. స్పెషల్ డ్రైవ్ లో ఎస్సై సురేష్, పోలీసు సిబ్బంది ఉన్నారు.