SAKSHITHA NEWS

Vanaparthi district will always be in my heart: Collector Tejas Nandalal Pawar

వనపర్తి జిల్లా ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
*సాక్షిత వనపర్తి
ఐ.ఏ.ఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని, అలాంటి అవకాశం తనకు రావడం, వనపర్తి జిల్లా ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కినందుకు చాలా గొప్పగా భావిస్తున్నానని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు.

జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ అధ్యక్షతన బదిలీపై సూర్యాపేట జిల్లాకు కలెక్టర్ గా వెళ్తున్న తేజస్ నందలాల్ పవార్ కు జిల్లా అధికారులు, యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు.

జిల్లా అధికారులందరూ కలెక్టర్ తో తమకున్న అనుబంధాన్ని, అనుభవాలని సభా వేదికగా పంచుకున్నారు.

వీడ్కోలు సందర్బంగా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ చేసిన భావొద్వేగ ప్రసంగం అందరి దృష్టిని ఆకట్టుకుంది.

కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారిగా ప్రతి ఒక్కరూ ప్రజలకు అత్యున్నత స్థాయి సేవలు అందించాలని సూచించారు.

ప్రతి అధికారి నిత్యం ఎంత మందికి సేవ చేసాం.. ఇంకా ఎంత మందికి చేయాలనే సంకల్పం కలిగి ఉండాలన్నారు.

ప్రభుత్వం ద్వారా ప్రజా సేవ చేసే అవకాశం పొందిన మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇంకా గమ్యాన్ని చేరుకునేందుకు ఎంత దూరం ప్రయాణించాలనే విషయాల్ని గుర్తుంచుకోవాలన్నారు.

ఆపదలో ఉన్న వ్యక్తికి మనం తప్ప అతన్ని ఆదుకోవడానికి ఎవరూ లేరు అని భావించి సేవ చేయాలన్నారు.

ఐ.ఏ.ఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని, అలాంటి అవకాశం తనకు వచ్చినందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నాన్నారు.

జిల్లా కలెక్టర్ గా వనపర్తికి వచ్చిన తర్వాత పరిపాలనలో ఇక్కడి అధికారులు సహాయ సహకారాలు అందించారని తెలిపారు.

వనపర్తి జిల్లా ప్రజలకు సేవ భాగ్యం దక్కినందుకు చాలా గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. భవిష్యత్తులో తాను ఎక్కడ ఉన్నా వనపర్తి జిల్లా తన గుండెల్లో ఉంటుందని కంట తడి పెట్టుకున్నారు.

అనంతరం అన్ని శాఖల జిల్లా అధికారులు, తమ సిబ్బందితో కలిసి కలెక్టర్ దంపతులకు పూల బొకేలు ఇచ్చి శాలువాలతో సత్కరించారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం నగేష్, అదనపు ఎస్పీ రామదాసు, జడ్పీ సీఈఓ యాదయ్య, టీజీఓ అధ్యక్షులు సురేష్, టీఎన్జీఓ అధ్యక్షులు అశోక్, ట్రెసా అధ్యక్షులు మల్లిఖార్జున,అన్ని జిల్లా శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

Vanaparthi district will always be in my heart: Collector Tejas Nandalal Pawar

SAKSHITHA NEWS