VANAMAHOTSAVAM వనమహోత్సవం కార్యక్రమంలో మొక్కలు నాటిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
సాక్షిత : జి.ఎచ్.ఎం.సి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ ప్రధాన రహదారిలో మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డివిజిన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వనమహోత్సవం కార్యక్రమంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు కావాలని సూచించారు. భావితరాలకు మనమిచ్చే ఆస్తి స్వచ్ఛమైన పర్యావరణమే అని అన్నారు. వనమహోత్సవంలో నాటిన మొక్కలను పరిరక్షించాల్సిన బాధ్యతను అధికారులు తీసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, శివరాజ్ గౌడ్, పాండుగౌడ్, భాస్కర్ రెడ్డి, నాగేషగౌడ్, పోశెట్టిగౌడ్, కాజామియా, రాజుగౌడ్, ఉమేష్, రాజ్యలక్ష్మి, మధులత, అరుణ, పుట్టం దేవి, సౌందర్య, లక్ష్మీ, సరిత.
జి.ఎచ్.ఎం.సి అధికారులు UBD సూపర్వైజర్ నాగ రాణి, మల్లేష్, సుధాకర్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.