telangana ఎస్ జి టి బదిలీలలో అన్ని ఖాళీలను చూపించాలి తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా శాఖ డిమాండ్.
telangana సాక్షిత : ఉపాధ్యాయుల బదిలీలలో భాగంగా ఎస్ జి టి ఉపాధ్యాయుల బదిలీలలో అన్ని ఖాళీలను చూపించాలని టి యు టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి డేవిడ్ ఎండి మునీర్ పాషలు డిమాండ్ చేశారు.
ఎస్ జి టి బదిలీలలో జిల్లా విద్యాశాఖ ఇచ్చిన సీనియార్టీ లిస్టు కు వెబ్ ఆప్షన్ సందర్భంగా ప్రదర్శితమవుతున్న లిస్టులకు తేడా ఉందని ప్రతి పాఠశాలకు మంజూరైన పోస్టుల కంటే తక్కువ సంఖ్యలు ఖాళీలు చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ముఖ్యమంత్రి ప్రతి ఊరిలో తండాలో పాఠశాల ఉండేటట్లు చూస్తామని జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలలను తెరిపిస్తామని చెప్పిన హామీని గుర్తు చేశారు
దానికి భిన్నంగా ఉన్న పోస్టులలో కోత పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా ఎస్ జి టి బదిలీలకు సంబంధించి వందల సంఖ్యలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం చాలా ఇబ్బంది కరంగా ఉందని ఎస్జీటీల బదిలీలను విడుతల వారిగా నిర్వహించి ప్రతి విడతకు 250 మంది చొప్పున ఉపాధ్యాయలకు అవకాశం కల్పించాలని విద్యాశాఖ ను కోరారు
అదేవిధంగా టెక్నికల్ సమస్యలు తలెత్తకుండా సాఫీగా జరిగేటట్టు చూడాలని కోరారు సమయానికి వెబ్ ఆప్షన్లు ఓపెన్ కాకపోవడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నయని అందుచేత కొంత సమయాన్ని అదనంగా ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులను కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
download app