ఉరుకూటి చైతన్య (సోషల్ ఆక్టివిటీస్) మరో అరుదైన పదవి
విశాఖ విజయనగరం శ్రీకాకుళం హ్యూమన్ రైట్స్ జోనల్ ప్రెసిడెంట్ పదవి……… నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ ఫోరం విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జోనల్ అధ్యక్షుడిగా గాజువాక కు చెందిన సామాజిక కార్యకర్త ఉరుకూటి చైతన్యకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు టీఎస్ రామచంద్ర నాయుడు తెలిపారు.. బాలల దినోత్సవం సందర్భంగా గాజువాక, పాత కర్ణ వాణి పాలెం లో గల స్ఫూర్తి నిరాదార బాలల ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఫారం అధ్యక్షుడు రామచంద్ర నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాజువాకలో ఎన్నో ఏళ్లుగా పలు సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఉరుకుట్టి చైతన్యను తమ ఫోరం లో మూడు జిల్లాల అధ్యక్షునిగా నియమించడం తనకు ఎంతగానో సంతృప్తినిచ్చిందని అన్నారు, కొద్దిరోజుల క్రితం దివ్యాంగులకు తన సొంత నిధులు లక్ష రూపాయలతో ఆదుకోవడం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ ఫోరం ని ముందుకు తీసుకు వెళ్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆశ్రమంలో ఉన్న బాలలకు పుస్తకాలు,పెన్నులు,పండ్లు అందజేశారు.. కార్యక్రమంలో పూర్తి నిరాదార బాలల ఆశ్రమం వ్యవస్థాపకులు రాజేష్, ఫోరం ప్రతినిధులు మొల్లి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు