అద్వితీయ నాయకుడు వై.ఎస్.ఆర్
-రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్
సాక్షిత రాజమహేంద్రవరం :
జన హృదయాలలో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 15 వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంకు వద్ద చందన నాగేశ్వర్ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ వైయస్ఆర్. అంటే. మూడక్షరాల పేరు మాత్రమే కాదు కోట్లాది తెలుగు ప్రజల నమ్మకమని, తెలుగు నేలపై వైయస్ఆర్ చెరిగిపోని జ్ఞాపకమన్నారు.
ఆంధ్ర ప్రజలకు ఎవరు చెయ్యని సంక్షేమ పథకాలను వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, పేద విద్యార్దులకు ఫీజు రియంబర్స్ మెంట్, అర్హులైన వారికి పెన్షన్ పథకం, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులు, ముఖ్యం గా పోలవరం ప్రాజెక్టు ఆవిర్భావానికి ముఖ్యకారకుడు వైఎస్ ఆర్ అని చందన నాగేశ్వర్ ప్రస్తుతించారు.అపర భగీరథుడు గా పెరుపొంది జన హృదయాల్లో శాశ్వత ముద్ర వేసుకున్న నాయకుడుమన వైఎస్ఆర్ అని కొనియాడారు .ముందుగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంకు వద్ద చందన నాగేశ్వర్ వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు చేతుల మీదుగా వృద్దులకు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలోనక్కా రాజబాబు, జేసిఎస్ రూరల్ ఇన్చార్జి లు రాజమౌళి, తడాల చక్రవర్తి, విష్ణు మూర్తి, బొప్పన సుబ్బారావు, సత్యప్రియ,సరితా రాణి , రేలంగి సత్యనారాయణ, చీర రాజు, వీరభద్రయ్య, తిరుమల శెట్టి శ్రీనివాస్,పసలపూడి శ్రీనివాస్, బత్తిన అప్పారావు, సఫారీ నాయుడు, బొమ్ము శ్రీను, సబ్బెళ్ల విజయదుర్గా రెడ్డి, దుంపా చంద్రారెడ్డి, కాపు భాను, పెనుమాక సునీల్, రామారెడ్డి,రోక్కం వంశీ, కృష్ణారెడ్డి, కామరాజ్, ఇమామ్ బాబ్జీ తదితర నాయకులపాల్గొన్నారు.