సివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర భవన్ లో వివిధ కళా రంగాలకు చెందిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమం
సికింద్రాబాద్ మార్చ్ 05 సాక్షిత
సివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ హరిహర భవన్ లో వివిధ కళా రంగాలకు చెందిన ప్రముఖులకు సన్మాన కార్యక్రమం తో పాటు ముఖ్య ఆహ్వానకుల చేతుల మీదుగా అవార్డులు అందజేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సినీ నటుడు సుమన్, సినీ ఆర్టిస్ట్ సాయికిరణ్ తో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల నుండి వేదాలు ఉపనిషత్తులు కలలు వైద్యం విద్య ఆరోగ్యం అనేక అంశాలలో ప్రతిభ కనబరిచిన బ్రాహ్మణులకు వారికి ప్రత్యేక పురస్కారాలు అవార్డులను బహుకరించి ఘన సత్కారాలను చేశారు.ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల మూలంగా వారిలో ప్రోత్సాహం పెంచి మరింత ముందుకు సాగేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు.వివిధ రంగాలలో నైపుణ్యం కనపరిచే ప్రతి ఘనపరుస్తున్న ప్రతి ఒక్కరిలో ప్రోత్సాహాన్ని నింపుతూ వారికి అవార్డులను అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.సినీ ఇండస్ట్రీలో నంది అవార్డులు కార్యక్రమం జరగక ఇండస్ట్రీలోని నటీనటులు కొంత నిరాశలో ఉన్నారన్న మాట వాస్తవమేనని ఇదే విషయాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గుర్తించి వెంటనే సినీ నటులను నంది అవార్డులు ఇచ్చి వారిలో మరింత ప్రోత్సాహాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.
సివి రామన్ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…