హాస్టల్ నుంచి ఇద్దరు మైనర్ విద్యార్థినిలు అదృశ్యం
సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట నియోజకవర్గం
దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన బాలికల ఆశ్రమ కళాశాల నుంచి ఇద్దరు మైనర్ విద్యార్థునులు అదృశ్యమయ్యారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థినిలది సొంత ఊరు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేగళ్లపాడు గ్రామానికి చెందిన మడకం లక్ష్మీ ప్రసన్న, మారుతి బివుల, వీరిద్దరూ ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఇద్దరు విద్యార్థునులు హాస్టల్ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లారు. బాలికలు తిరిగి రాకపోవడంతో ప్రిన్సిపల్ బి. రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆచూకీ తెలిసినవారు దమ్మపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.
