కలెక్టర్ ఆదేశాలను భే” ఖాతరు చేసిన వనపర్తి మున్సిపల్ కమిషనర్

Sakshitha news

కలెక్టర్ ఆదేశాలను భే” ఖాతరు చేసిన వనపర్తి మున్సిపల్ కమిషనర్

మున్సిపాలిటీలో జరిగే పాలనపై వార్తా కథనాలు ప్రచరణ చేయడమే నేరమా,…. జర్నలిస్టు ఆవేదన
ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు పార్టీల నాయకులు, జర్నలిస్టు సంఘాలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి

సాక్షిత వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డు చందాపూర్ రోడ్డు పీర్ల గుట్ట శాంతినగర్ కాలనీలో ఉంటున్న జర్నలిస్టు కాగితాల గోపాల్ ఇంటి మంచినీళ్లు నల్ల కనెక్షన్ ను ఎలాంటి హెచ్చరికలు లేకుండానే నల్లా కనెక్షన్ ను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు డి ఈ అజ్ఞలతో లైన్మెన్ వాటర్ బాయ్స్ తొలగించి నెలరోజులవుతున్న క్రమంలో నల్ల కనెక్షన్ ను తిరిగి ఇవ్వాలని ముందుగా మున్సిపల్ కమిషనర్ కు దరఖాస్తు ద్వారా కోరడం జరిగింది కానీ నల్ల కనెక్షన్ ఇవ్వకపోయే సరికి జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో నల్ల కనెక్షన్ ఇప్పించవలసిందిగా కోరుతూ సెప్టెంబర్ 29న దరఖాస్తు చేసుకోవడం జరిగింది స్పందించిన జిల్లా కలెక్టర్ నల్ల కనెక్షన్ ఇవ్వవలసిందిగా మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించడం జరిగింది కానీ కలెక్టర్ ఆదేశించి నేటికీ 15 రోజులు పూర్తవుతున్న నల్ల కనెక్షన్ ఇవ్వకుండా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తనను మున్సిపల్ కమిషనర్ డి ఈ యూనిస్ లైన్మెన్ అంజి వాటర్ బాయ్స్ వేధిస్తున్నార ని జర్నలిస్టు కాగితాల గోపాల్ తెలిపారు తనకు మున్సిపాలిటీ నల్ల కనెక్షన్ తొలగించిన విషయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేసిన విషయం ఓదినపత్రికలో వార్త ప్రచారణ కావడంతో
మున్సిపల్ అధికారులు వాటర్ బాయ్స్ ని జర్నలిస్ట్ ఇంటి వద్దకు పంపించేసి తనను బెదిరించడం జరిగిందని ఈ క్రమంలో జర్నలిస్టుతో వాటర్ బాయ్స్ వాగ్వి వివాదానికి దిగి తన ఇంటి వద్దకు వచ్చినట్లుగా సాక్ష్యం కోసం ఫోటోలు వీడియోలు తీసుకొని వెళ్ళిపోయారు కానీ నల్ల కనెక్షన్ మాత్రం తిరిగి ఇవ్వలేదనీ బాధితుడు మున్సిపల్ డి ఈ కి ఫోన్ చేసి విషయం తెలపగా గుంత త్రవ్వు కొంటె నల్ల కనెక్షన్ ఇస్తామని లేకుంటే లేదని అనడంతో ఆల్రెడీ ఉన్న పాత కనెక్షనుయే కాబట్టి కొత్త ది కాదనీ మీరు తొలగించిన కనెక్షన్ ను మీరే ఇవ్వాలని డి ఈ నీ కోరడం జరిగిందని ఇదంతా మున్సిపాలిటీలో జరుగుతున్న పాలనపై కథనాలు పత్రికలో ప్రచరన చేయడం కారణంగానే కక్షగట్టి రాజకీయ నాయకులు అదికారులు కలిసి తనపై ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని నల్ల కనెక్షన్ తొలగించడంతో ముఖం, స్నానం, బట్టలు ఉతకడానికి కనీసం వాష్ రూమ్ కు వెళ్లడానికి కూడా మంచినీళ్లు లేక సులబ్ కాంప్లెక్స్ కు లాడ్జింగ్ లో తీర్చుకుంటూ కాలం వెళ్లబుచ్చడం వర్షం కురిసిన రోజున బకెట్లలో వర్షపు నీటిని పట్టుకొని కాలకృత్యాలను తీర్చుకోవడం జరుగుతుందని అలాగే వంట చేసుకోవడానికి త్రాగడానికి మంచి నీళ్లు లేకపోవడంతో హోటల్లో భోజనం చేస్తూ బిస్లర్ బాటిల్ను కొని తాగవలసి వస్తుందని దీంతో తనకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని ప్రజల పక్షాన ప్రజల కోసం మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక అంశాల పై ఒక జర్నలిస్టుగా తన విధిని నిర్వహించడమే నేరంగా మారిందని నల్ల కనెక్షన్ను ఎందుకు తొలగించారో ఎందుకు నల్ల కనెక్షన్ ఇవ్వడం లేదు కారణం తెలపకపోవడం విశేషమని వ్యాపోతూ
ప్రతినెల జీతాలు తీసుకుంటూ అధికారులు గౌరవ వేతనం తీసుకుంటూ నాయకులు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎలాంటి జీతభత్యాలు లేని పాత్రికేయ లు మాత్రం ప్రజల పక్షాన పత్రికల ముఖంగా ప్రశ్నిస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయని తనకు కలిగిన ఇబ్బందులు రేపు ప్రతి జర్నలిస్టుకు ఎదురవుతాయని కాబట్టి ప్రతి జర్నలిస్టు ప్రతి జర్నలిస్టు సంఘాలు స్పందించి భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎవరికి ఎదురు అవ్వకుండా తాను చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతు ఇవ్వాలని అలాగే ప్రతినిత్యం ప్రజలు ప్రజాసంఘాలు ప్రజాప్రతినిధులు పార్టీల నాయకుల కోసం వారితో మమేకమై పనిచేసే పాత్రికేయులకు మద్దతు నిలవాలని విజ్ఞప్తి చేశారు .
కనెక్షన్ తొలగించే సమయంలో మున్సిపల్ రోజువారి సిబ్బంది 20 నుంచి 30 మంది తన ఇంటి మీదకి దాడి చేయడానికే వచ్చారని ఆ సమయంలో తాను ఇంటి దగ్గర లేక పోయేసరికి అక్కసుతో తన నల్ల కనెక్షన్ తొలగించి వెళ్లారని ఆ క్రమంలో చుట్టుపక్కల కుటుంబాల వారికి ఇతనికి మంచినీళ్లు ఇస్తే మీ నల్ల కనెక్షన్లు కూడా తొలగించేస్తామని చుట్టుపక్కల కుటుంబాలను బెదిరించి వెళ్లారని పాత్రికేయుల పరిస్థితి ఇలా ఉంటే మామూలు ప్రజల పరిస్థితి పట్టణ ప్రజల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్లు స్పందించి తనకు నల్ల కనెక్షన్ ఇప్పించి న్యాయం జరిగేలా చూడాలని కాగితాల గోపాల్ కోరుతున్నారు