కార్మిక సంఘాలే కమ్యూనిస్టు పార్టీలకు బలం : సిపిఎం పార్టీ….

Sakshitha news

కార్మిక సంఘాలే కమ్యూనిస్టు పార్టీలకు బలం : సిపిఎం పార్టీ

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం కార్మిక సంఘాలు బలోపేతం అయితేనే కమ్యూనిస్టు పార్టీలు గట్టి పడతాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెర పాటి పుల్లయ్య అన్నారు. అశ్వారావుపేటలో నిర్వహించిన సిఐటీయూ హమాలీ శాఖ సమావేశంలో ఆయన ఈ వాక్యాలు చేశారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను కార్మికుల్లోకి తీసుకెళ్లి, వారి హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నేతలు ప్రసాదరావు, గంగరాజు, రాము తదితరులు పాల్గొన్నారు.