రెండు కేజీల గంజాయి మూడు స్కూటీలు స్వాధీనం,ఐదుగురు అరెస్ట్
సాక్షిత వనపర్తి
కొత్తకోట నుండి వనపర్తికి మూడు స్కూటీలపై గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుండి 2 కేజీల గంజాయిని మూడు స్కూటీలను స్వాధీనం చేసుకున్నట్టు పట్టణ పోలీసులు తెలిపారు వనపర్తి పట్టణ రెండు ఎస్సై శశిధర్ తెలిపిన వివరాల ప్రకారం
మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కొత్తకోట నుండి వనపర్తి వైపు మూడు స్కూటీలపై గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ప వనపర్తి పట్టణ టౌన్ SI-2 శశిధర్ మరియు సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన వ్యక్తులను ఆపి తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు 2 కిలోల గంజాయి లభ్యమైంది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
SI శశిధర్ ఫిర్యాదు మేరకు టౌన్ SI-1 హరిప్రసాద్ కేసు నమోదు చేసి, నిందితులను జ్యూడిషియల్ రిమాండ్‌కు తరలించారు. అలాగే వారి వద్ద నుండి మూడు స్కూటీలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై హరిప్రసాద్, రెండవ ఎస్ ఐ శశిధర్, ఆర్ఎస్ఐ సురేందర్, కానిస్టేబుళ్లు రాజమోహన్, నాగరాజు, రాజేష్, పూరేందర్, శివసాగర్, ఆంజనేయులు భాస్కర్ లను వనపర్తి సీఐ రత్నం అభినందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY