ముంపు ప్రాంతాల్లో “తుడ” చైర్మన్ పర్యటన
** రేణిగుంట వాసులకు ప్రభుత్వం తరపున భరోసా
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద నీరు అధికంగా చేరుతున్న రేణిగుంట వసుంధర నగర్, నక్కల కాలనీ ప్రాంతాలను సాయంత్రం తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పరిశీలించారు.
లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాలలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు. తుడా నుంచి కూడా అవసరమైన సహాయక చర్యలు అందిస్తామని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
