కట్ట పుట్టాలమ్మను దర్శించుకున్న “తుడ” చైర్మన్

Sakshitha news

కట్ట పుట్టాలమ్మను దర్శించుకున్న “తుడ” చైర్మన్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులు పొంది చల్లగా ఉండాలని కోరుకున్నట్లు “తుడ” ఛైర్మెన్ డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి పంచాయతీ దొడ్లమిట్ట గ్రామంలో వెలసిన కట్టపుట్టాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. బుధవారం తుడా చైర్మన్ అండ్ టీటీడీ బోర్డు సభ్యులు డాలర్స్ దివాకర్ రెడ్డి జాతరలో పాల్గొని కట్టపుట్టాలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు తుడా చైర్మన్ ని ఘనంగా ఆహ్వానించి అమ్మవారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం తుడా చైర్మన్ ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మహిమాన్వితమైన కట్ట పుట్టాలమ్మ జాతర అత్యంత వైభవంగా జరగడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర విద్య – ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ కి అమ్మవారి చల్లని దీవెనలు ఉండాలని… వారు అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని కోరుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని దివాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కట్ట పుట్టలమ్మ ఆలయ చైర్మన్ రాజేంద్ర, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుజ్జినాయుడు, వెంకటాచలం, సుధా, రామ్ నారాయణ, మోహన్, శీను, పెద్ద ఎత్తున యువత పాల్గొన్నారు.