టీటీడీ చైర్మన్ ను కలిసిన నూతన ఈవో సింఘాల్
సాక్షిత ప్రతినిధి – తిరుమల: టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీ.ఆర్.) నాయుడును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈవో సింఘాల్ ను చైర్మన్ శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు గుడిపల్లి భాను ప్రకాష్ రెడ్డి, నరేష్ పాల్గొన్నారు.
టీటీడీ ఉద్యోగులకు పూర్వపు ఈవో థ్యాంక్స్
టీటీడీ ఈవోగా పనిచేసి బదిలీపై వెళ్లిన టీటీడీ పూర్వపు ఈవో జె.శ్యామలరావు తనకు విధి నిర్వహణలో సహకరించిన టీటీడీ అధికారులు, ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 14 నెలల కాలంలో తిరుమలలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. వచ్చే 25 ఏళ్ల పాటు స్వామివారి అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదం నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఏసీ ఫౌండర్ ప్రెసిడెంట్ ఆంజనేయులు, ఉద్యోగ సంఘం నేతలు గోల్కొండ వెంకటేశం, గంపల వెంకట రమణా రెడ్డి, కాటా గుణశేఖర్, జాటోత్ భాస్కర్, ప్రసాదరావు, మహిళా సంఘం నాయకురాళ్లు కట్టమంచి ఇందిర, సామిరెడ్డి కల్పన, శాంతి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
