మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి- ఎస్టీయు
సాక్షిత :: రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం చిలకలూరిపేట పట్టణ శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా చిలకలూరిపేట పట్టణంలోనిఅన్ని మున్సిపల్ పాఠశాలలు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులతో సభ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్టీయూ రాష్ట్ర డైరీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయులకు గత దశాబ్ద కాలంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లేక ఇబ్బందులు పడుతున్నారని కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ ఖాతాలు ఏర్పాటు చేయాలని కోరారు. సాధారణ కార్మికులకు సైతం ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉంటుందని ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రావిడెంట్ ఫండ్ ఖాతా ఉంటుందని కానీ మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రావిడెంట్ ఫండ్ ఖాతా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు, విద్యార్థుల సంఖ్య ఆధారంగా డీఎస్సీ2025లో ఉపాధ్యాయులను పాఠశాలలకు కేటాయించాలని కోరారు, పెండింగ్ లో ఉన్న తెలుగు మరియు హిందీ పండిట్ పోస్టుల ప్రమోషన్లు డీఎస్సీ 2025 నియామకాలలోపు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర విద్యాశాఖ ను కోరారు. మున్సిపల్ ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసినందున ఎటువంటి వివక్ష లేకుండా సర్వీస్ నిబంధనలు ప్రకారం అర్బన్ ఎంఈఓ పోస్టులు మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు ఇవ్వాలని కోరారు, మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలను మున్సిపల్ హై స్కూల్ క్లస్టర్ లోనే కొనసాగించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో జూనియర్ కళాశాలలు, కొత్తగా ఏర్పడిన కాలనీలు మరియు టిడ్కో గృహాల వద్ద నూతన పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు. పాఠశాలలు లేని ప్రాంతాల్లో నుండి ఆటోలలో ప్రయాణిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు ప్రయాణ భత్యం సౌకర్యం కల్పించాలని కోరారు
ఎస్ టి యు పల్నాడు జిల్లా కార్యదర్శి వినుకొండ అక్కయ్య, పట్టణ అధ్యక్షులు మేకల కోటేశ్వరరావు పట్టణ ప్రధాన కార్యదర్శి వడ్లాన జయప్రకాష్ ఆర్థిక కార్యదర్శి హనుమంతు నాయక్ జిల్లా కౌన్సిలర్ షేక్ జమీర్ భాష ఎస్టియు నాయకులు ఈ సామ్యూల్ అట్లూరి శ్రీనివాసరావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు
