SAKSHITHA NEWS

దేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలికి ఘన నివాళి.

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సంఘ సంస్కర్త. మహిళా విద్యకు తన జీవితాన్ని అంకితం చేసిన త్యాగమయి, సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది, అనంతరం సూర్యాపేట బిజెపి జిల్లా కార్యాలయంలో జిల్లా కోర్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ సమావేశంలో బూత్ కమిటీ ఎన్నికల ప్రక్రియ, మండల కమిటీ ఎన్నికల ప్రక్రియ గురించి చర్చించడం జరిగింది, ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, జిల్లా ఎన్నికల ఇంచార్జ్ నాగురామ్ నామోజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కడియం రామచంద్రయ్య, చల్లా శ్రీలత రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్లు కర్నాటి కిషన్ కనగాల నారాయణ, అంబల్ల నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు సలిగంటి వీరేంద్ర, మల్లెపాక సాయిబాబా, అక్కిరాజు యశ్వంత్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, సీనియర్ నాయకులు రంగరాజు రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS