ఘంటసాలకు ఘన నివాళి
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తమ అభిమాన గాయకున్ని స్మరించుకుంటూ ఆయన అభిమానులు ప్రతి నెల 1వ తారీఖున ఆయన విగ్రహానికి మంచినీటితో శుద్ధి చేసి పుష్పాంజలతో నివాళి అర్పిస్తున్నారు. తిరుపతిలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయనను స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్ లోని ఆయన విగ్రహానికి ప్రతి నెల ఒకటో తారీఖున మంచినీటితో శుద్ధిచేసి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి సభ్యులు ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు.
అనంతరం ఘంటసాల అభిమానులు డాక్టర్ సోము ఉమాపతి, డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభంలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్, సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోక ప్రభాకర్ నాయుడు, ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, మిట్టపల్లి బ్రహ్మానందం , పోలే జనార్దన్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, టీచర్ తిరుమలయ్య, ఆర్ఎంఎస్ భాస్కర్, గాయకులు పద్మనాభం, పురోహితుడు సురేష్ స్వామి, ఆది గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY