మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
సాక్షిత పల్నాడు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా రెవెన్యూ అధికారి (DRO) శ్రీ నారదముని గారు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజనులను ఏకం చేసి, సాయుధ పోరాటం నడిపిన గొప్ప విప్లవకారుడు అల్లూరి అని కొనియాడారు. రంపా తిరుగుబాటు ద్వారా తెల్లదొరల గుండెల్లో నిద్రపోయిన ఆయన త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు. 1924 మే 7న దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అల్లూరి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గోవింద్ నాయక్, గణాంక అధికారి సత్యనారాయణ రాజు, టూరిజం అధికారి నాయుడమ్మ, సూపరింటెండెంట్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

