రైతు జీవితాన్ని అర్థం చేసుకున్న నాయకుడే వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం గర్వకరణం…
….
సాక్షిత : ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పిన సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు…
బిఆర్ఎస్ సభలో చేసిన వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని మళ్లీ కర్రుకాల్చి వాత పెట్టడం తథ్యం…
ప్రతి ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని వెల్లడి..
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని వ్యాఖ్య…
పేద ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్న ప్రభుత్వం…
తెలంగాణ సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు..
రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా కార్యక్రమంలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు ….
హన్మకొండ జిల్లా సుబేదారి ఆర్ట్స్ & సైన్స్ కళాశాల మైదానంలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా – 2026 కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖలచే ఏర్పాటు చేసిన స్టాల్స్ లను పరిశీలించిన * తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , రాష్ట్ర అటవీ పర్యావరణ,దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ , వరంగల్ కడియం కావ్య, సహాచర ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణ రావు, నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి పాల్గొన్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి * కేఆర్ నాగరాజు ….
తొలుత హన్మకొండ పర్యటనకు విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ని కండువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు….
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు అని కొనియాడారు. తాను పాల్వంచ సీఐగా విధులు నిర్వహిస్తున్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. ఒక పని నిమిత్తం మంత్రి వద్దకు వెళ్లినప్పుడు స్వయంగా తలపాగా ధరించి ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయ పనులు చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయానన్నారు. రైతు జీవితాన్ని దగ్గరగా చూసిన నాయకుడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండటం రాష్ట్ర రైతాంగానికి గర్వకారణమని పేర్కొన్నారు…
ఓరుగల్లు నేల ఎన్నో మహనీయులను అందించిందని, కాళోజీ నారాయణరావు, చాకలి ఐలమ్మ వంటి మహానుభావుల స్ఫూర్తి తెలంగాణ సమాజానికి మార్గదర్శకమని అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, ఆ మోసాలను గుర్తించిన ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు. ఇటీవల BRS నిర్వహించిన సభలో చేసిన వ్యాఖ్యలను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు…
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. పేద ప్రజలు నాణ్యమైన సన్నబియ్యంతో అన్నం తినాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేపట్టిందని చెప్పారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు…
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, KUDA చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, మాజీ టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి, జీల్లాల కలెక్టర్లు, అధికారులు, రైతు సంఘాలు రైతులు తదితరులు పాల్గొన్నారు….

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY