SAKSHITHA NEWS

పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నాం.

టిడిఆర్ బాండ్లు అందజేసిన కమిషనర్ ఎన్.మౌర్య

నగరంలో ఏర్పాటు చేసిన మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి పారదర్శకంగా టీడీఆర్ బాండ్లు పంపిణీ చేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టిడిఆర్ మేళాలో అర్హత పొందిన 22 మందికి సోమవారం టిడిఆర్ బాండ్లను కమిషనర్ అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేయించడం కోసం మేళా నిర్వహిస్తున్నామని అన్నారు 95శాతం ఆన్లైన్ చేశామని, కోర్టు కేసులు, ప్రభుత్వ, టిటిడి భూములు, 22 ఏ కింద ఉన్నవి మాత్రమే పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు ఐదు బాండ్లు ఇచ్చామని, 22 టిడిఆర్ బాండ్లు లబ్దిదారులకు స్వయంగా అందజేశామని అన్నారు. ఖాళీ జాగాలకు లొకాలిటీ వాల్యూ ప్రకారం గుర్తించామని అన్నారు. టిడిఆర్ బాండ్ల కమిటీ సమావేశమై 96 మందికి ప్రీ అప్రూవల్ తీసుకుని అర్హత ఉన్నట్లు గుర్తించామని అన్నారు. వీరందరూ గిఫ్ట్ డీడ్ ఇస్తే తరువాత బాండ్లు అందజేస్తామని అన్నారు. వీరు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా తిరుపతి, రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఆర్.డి, విజయభాస్కర్, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, డీసీపీ మహా పాత్ర, ఏసీపి లు బాలాజి, మూర్తి, తదితరులు పాల్గొన్నారు.