
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ
ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో, క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో పశ్చిమ నియోజకవర్గం లోనీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు నైపుణ్య శిక్షణనిస్తున్నారు.అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరచడానికి కేబీఎన్ కళాశాల ఆవరణలో బుధ, గురువారాల్లో రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నారు.
ప్రైవేటు పాఠశాలలో నర్సరీ విద్యకు ధీటుగా అంగన్వాడీల్లో చిన్నారులకు విద్యపై ఆసక్తి కలిగేలా తీర్చిదిద్దనున్నారు.
బుధవారం జరిగిన ఈ శిక్షణ కార్యక్రమంలో పోరంకి లోని వికాస విద్యా వనం పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని చిన్నారులకు ఆటపాటలతో చదువుపై దృష్టి కేంద్రీకరించేలా మరియు ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ మీద, అంగన్వాడీ టీచర్లకు నైపుణ్య శిక్షణను ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వికాసా విద్యావనం ఉపాధ్యాయులు అన్నపూర్ణ, అలేఖ్య, భారతి, ఐసిడిఎస్ సూపర్ వైజర్ జీ ప్రశాంతి సుజనా ఫౌండేషన్, మరియు క్రిస్ప్ స్వచ్ఛంద సంస్థల సిబ్బంది పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app