ఇంకెన్నాళ్లు మాకు ఈ బాధలు అంటున్న గ్రామవాసులు
నరకయాతన పడుతున్న వాహనదారులు
కనీస అవగాహన లేనటువంటి కాంట్రాక్టర్ల వీళ్ళు అని చర్చించుకుంటున్న ప్రజలు మరియు వాహనదారులు
బాపట్ల నుండి కర్లపాలెం వెళ్ళు ప్రధాన రహదారి నాగరాజు కాలవ వద్ద నూతన హైవే రోడ్డు నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన డైవర్షన్ దగ్గర గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు గుంటల్లో నీళ్లు నిలబడటం వల్ల గ్రామస్తులు మరియు వాహనదారులు నరకయాతన పడుతున్నారు హైవే రోడ్డు నిర్మాణం జరిగిన తరువాత అయినా గ్రామములో వెళ్లే మార్గం కొరకు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి కాబట్టి అదేదో ముందుగానే సర్వీసులో ఏర్పాటు చేసినట్లయితే గ్రామస్తులు గాని మరియు వాహనదారులు గాని ఎవరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉండదు కదా మరి ఆ మాత్రం ఆలోచన కూడా లేని అటువంటి కాంట్రాక్టర్ల అని గ్రామస్తులు మరియు వాహనదారులు చర్చించుకుంటున్నారు