SAKSHITHA NEWS

30 బుల్లెట్ వాహనాల మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి జరిమానా విధించిన ట్రాఫిక్ పోలీసులు

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

మోడిఫైడ్ సైలెన్సర్లు అమర్చిన బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను తొలగించి, జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ మోహన్ బాబు తెలిపారు..
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు ఖమ్మం నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో మోడిఫైడ్ సైలెన్సర్లతో నడిపే బుల్లెట్ వాహనాలపై రెండవ రోజు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కొందరు యువకులు వాహనాలకు సంబంధిత సంస్థ ఇచ్చిన సైలెన్సర్లను మార్పుచేసి.. వింత శబ్దం వచ్చే వాటిని అమర్చి,రోడ్లపై అకస్మాత్తుగా వింత శబ్దాలు చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అందులో భాగంగా
30 మోడిఫైడ్ సైలెన్సర్ల వరకూ తొలగించి ఒక్కో వాహనదారుడికి రూ.1,000 జరిమానా విధించారమని తెలిపారు.
కార్యక్రమంలో ఆర్ ఐ సాంబశివరావు, ఎస్సై రవి, సాగర్,వెంకన్న, రాము పాల్గొన్నారు.


SAKSHITHA NEWS