టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు.
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి పై నిన్న బిఆర్‌ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నర్సారెడ్డి భూపతిరెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులను తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది.
విధ్యార్ధి దశ నుండి కాంగ్రెస్ పార్టీ సిద్దాంతం కోసం పనిచేస్తూ నేటికీ కాంగ్రెస్ పార్టీని ఆంటీ పెట్టుకుని ఉంటూ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారికి అన్నివిధాలుగా అండగా ఉంటున్న నర్సారెడ్డి భూపతిరెడ్డి పై ఇకపై ఆరోపణలు చేసే ముందు వారి స్థాయి తెలుసుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్, నియోజకవర్గ B బ్లాక్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,నియోజకవర్గ A బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ ,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ల లక్ష్మి ,జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు సదానందం ముదిరాజ్ ,జిల్లా ఫిషెర్మెన్ కాంగ్రెస్ అధ్యక్షులు పోచి మహేశ్ ముదిరాజ్ ,మైనారిటీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ సమీర్ ఖాన్,రాష్ట్ర ఓబిసి సెల్ జాయింట్ కో ఆర్డినేటర్ భరత్ గౌడ్,కుత్బుల్లాపూర్ మైనారిటీ సెల్ అధ్యక్షులు జలీల్ ఖాన్,మాజీ సర్పంచ్ మిద్దెల యాదిరెడ్డి ,జిల్లా యువజన కాంగ్రెస్ సెక్రెటరీ బత్తుల చిరంజీవి,దుండిగల్ మున్సిపాలిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఫాతిమా,నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్‌సి సెల్ అధ్యక్షులు దాసరి మహేశ్,మాజీ వార్డ్ సభ్యులు పరశురాం గౌడ్,సీనియర్ నాయకులు జక్కుల మల్లేశ్,PACS సభ్యులు శ్రీనివాస్,ధర్మారెడ్డి, రవి నాయక్,బండ్ల విజయ్ కుమార్మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కింద తెలిపిన విషయాలను ప్రస్తావించడం జరిగింది.
టిపిసిసి ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి గారిపై ఎమ్మెల్యే చెంచాల అసత్య ఆరోపణలను ఖండిస్తున్నాము.- కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ.
ఎమ్మెల్యే కబ్జాలపై ప్రశ్నించిన నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆరోపణలకు సమాధానం చెప్పకుండా అదే కబ్జాలు చేసిన చెంచాలతో అసత్యాలు మాట్లాడించిన ఎమ్మెల్యే బహిరంగ చర్చకు సిద్దమా?
మీరు కబ్జాలు చేసిన భూముల వద్దనే తేల్చుకోవడానికి మీరు సిద్దమా??
దమ్ముంటే చేసిన ఆరోపణలు నిజం కావని నిరూపించంచండి అంతే కానీ మా నాయకులపై మీ చెంచాలతో అసత్య ఆరోపణలు చేస్తే ఖబద్ధార్ అని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ తార్పున హెచ్చరిస్తున్నాము.
రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ అని సంకలు గుద్దుకుంటున్నారు కదా.
ఆనాడు ప్రజలను,కుల సంఘాలను కాలనీ అసోసియేషన్ లను మభ్యపెట్టి ఓట్లు సంపాదించి నేడు విర్రవీగుతున్న మీకు దమ్ముంటే రాజీనామా చేసి రండి ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం, ప్రజలు మీ వైపు ఉన్నారో లేక మా వైపు ఉన్నారో అని
గడిచిన పదేళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా భూకబ్జాలు,సెటిల్మెంట్లు చేసి సంపాదించిన అక్రమ డబ్బు మదం తో మాట్లాడుతున్న మీరు,
మీ ఎమ్మెల్యే వెంట ఉన్నది ఎంత మందో ఒకసారి లెక్కపెట్టుకోండి. కనీసం మీ పార్టీ లో గెలిచిన కార్పొరేటర్లు కూడా మీ ఎమ్మెల్యే వెంట తిరుగుతలేరు అంటే మీరే అర్ధం చేసుకోండి.
1986లో ఎన్‌ఎస్‌యూఐ తరపున కాలేజీ ఎన్నికలలో గెలిచినప్పటి నుండి ఈరోజు వరకు కాంగ్రెస్ కండువా మాత్రమే కప్పుకున్న నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి .
కానీ మీ ఎమ్మెల్యే తన వ్యక్తిగత స్వార్ధం కోసం అధికారంకోసం అవసరానికి తగ్గట్టుగా పార్టీలు మారి ఇప్పుడు మీరు నీతులు చెప్తున్నారా?
కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులు పార్టీని వదిలివెళ్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతను భుజాన ఎత్తుకుని న్యోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులకు మనోధైర్యాన్ని ఇస్తూ మీ పార్టీ,మీ ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ అరచకలపై పోరాటం చేసి మీకు చెమటలు పట్టించిన విషయాన్ని అప్పుడే మర్చిపోయి ఇప్పుడు ఏమి తెలియనట్టు మాట్లాడటం మీ అహంకారానికి నిదర్శనం.
1986-1987లోనే ఎన్‌ఎస్‌యూఐ తరపున మహబూబ్ కాలేజీ ఎన్నికలలో ఉపాధ్యక్షునిగా,1987-1988 లో అధ్యక్షునిగా గెలిచారు నర్సారెడ్డి భూపతి రెడ్డి . అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఉన్న కే.ఎమ్ ప్రతాప్ మరియు కె.ఎమ్ పండు తో కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకమలలో పాల్గొనడం జరిగింది. ఒక నాయకుడి వెంట పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటే కూడా జీతం తీసుకున్నాడు అని అంటే మీరు చేస్తున్న చెంచాగిరిని ఏమనలో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము.
ఒక సినీ హీరో వల్ల ఆస్తిని అనుభవిస్తున్నామని ఆరోపిస్తున్న వారికి సూటిగా సమాధానం చెప్తున్నామ్. న్యాయంగా అదే సినీ హీరో స్నేహితుడి దగ్గరి నుండి భూమిని కొనుగోలు చేసామే తప్ప ఎవరిని కూడా మోసం చేయలేదనే విషయాన్ని సూటిగా తెలియచేస్తున్నాము.
ఐనా బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చెయ్యడం,డబ్బులు ఇవ్వని బిల్డర్లను ముప్పు తిప్పలు పెడుతూ నిర్మించిన భవనాల వద్దకు అధికారులను అడ్డం పెట్టుకుని జేసిబిలు పంపించి డబ్బులు వసూలు చేసే మీ లాంటి వారు మోసం,నమ్మక ద్రోహం లాంటి మాటలు మాట్లాడితే వాటికే అవమానం అని తెలియచేస్తున్నాము.
గడిచిన పదేళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని విచ్చలవిడిగా మీరు చేసిన భూకబ్జాలపై పోరాటాన్ని ప్రకటిస్తున్నాము.
మీరు కబ్జా చేసిన భూముల వద్దనే నుండి కాంగ్రెస్ శ్రేణులు అందరం కూడా కూర్చుని వాటిని కూలగొట్టి మిమ్మల్ని జైలు ఊచలు లెక్కపెట్టేలాగా చేసేవరకు కూడా ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము.
*కుత్బుల్లాపూర్ BRS MLA/MLC మరియు వారి అనుచరులు గత తొమ్మిది సంవత్సరాలుగా కుత్బుల్లాపూర్ లో దాదాపు 1200 ఎకరాలు కబ్జా చేసింది నిజం కాదా? ప్రజలందరికీ తెలిసినది నగ్నసత్యం.
*గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాల కాలంలో ప్రశ్నించిన వ్యక్తులపై ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించింది నిజం కాదా?
*ప్రస్తుతం బిఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకుంటున్న కేపీ వివేకానంద ఎన్ని పార్టీలు మారిండో అందరికీ తెలిసిందే కదా! పార్టీలు ఫిరాయించినోడే నీతులు చెప్తుంటే వినాల్సిన కర్మ కుత్బుల్లాపూర్ ప్రజలకు వచ్చింది?
*కుత్బుల్లాపూర్ పరిధిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అధికారం పోగానే వాళ్లు చేసిన అక్రమాలకు భయపడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని బ్రతిమిలాడుకున్నది నిజం కాదా?
*గత తొమ్మిది సంవత్సరాల్లో ప్రభుత్వ భూములు చెరువులు పార్కులు కబ్జాలు ప్రత్యక్ష,పరోక్ష సహకారం అందించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అనుచరులు (కబ్జాదారులు) కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కబ్జాల కట్టడి, క్రిమినల్ కేసులు నమోదు చేయడం వల్ల ఉపాధి కోల్పోయి మతిభ్రమించి పిచ్చి పిల్ల నా కొడుకులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మాజీ నర్సారెడ్డి భూపతి రెడ్డి పై పిచ్చి కూతలు కూస్తున్న టిఆర్ఎస్ పిల్లకోతులకి వీపులు పగులుతాయని & ఎమ్మెల్యే ఎమ్మెల్సీ చేసిన అక్రమాలపై అతి త్వరలోనే ప్రజాక్షేత్రంలో చట్ట పరంగా శిక్ష పడుతుందని హెచ్చరిస్తున్నాము.
*నర్సారెడ్డి భూపతిరెడ్డి విద్యార్థి దశలోనే విద్యార్థి సంఘం నాయకుడుగా ఎన్నికైనప్పుడు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నిక్కర్ కూడా సరిగా తోడుకోలే!
రాజకీయ గురువులకి సేవ చేస్తే జీతం అనే కుక్కలకి ఇప్పుడు మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దగ్గర చేసే సేవను జీతగాడు అనొచ్చా వెధవల్లారా?
*మీ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ లో దాదాపు 25 మంది అనుచరులతో 900 ఎకరాలకు కబ్జ పెట్టించి కమిషన్లు తీసుకున్నది నిజం కాదా?
*94 చెరువుల్లో 9 సంవత్సరాల్లో కబ్జాలకు సహకరించాడు గానీ ఒక్క చెరువునైనా కాపాడి సుందరీకరించాడా చేతగాని ఎమ్మెల్యే?
*ఎస్ ఎన్ డి పి(SNDP) మొదలుపెట్టి కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దండుకొని ఎస్ఎన్ డిపి((SNDP) ఎందుకు పూర్తి చేయలేదుఎంఎల్ఏ?
*నర్సారెడ్డి భూపతిరెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త, పార్టీ అధికారంలో ఉన్న లేకపోయినా పార్టీ కార్యక్రమాల విజయవంతం కోసం ఎంతో శ్రమించి,పార్టీ అధికారం రావడానికి రేవంత్ రెడ్డి పాదయాత్రకి అండదండగా నిలబడింది నిజం కాదా రా వెధవల్లారా?
*కబ్జాలు చేసుకోవడానికి, కేసులకు భయపడి పార్టీ మారుతామని మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాగా నర్సారెడ్డి భూపతిరెడ్డి కాదురా బాబు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడిన నాయకుడు?
*రేవంత్ రెడ్డి అన్న పాదయాత్రకి మొదటి నుండి చివరి వరకు పార్టీ కోసం పని చేసిన నాయకుడు భూపతి రెడ్డి అన్న?
*అన్నా అని తన దగ్గరకు వచ్చిన వారికి అధికారం ఉన్నా లేకపోయినా పనిచేసి పెట్టే నాయకుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి .