
గ్రామీణ ప్రాంతాల ఓటర్ జాబితాలో ఉన్న ఓట్లను పట్టణంలో ఓటరు నమోదు చేసుకున్న దరఖాస్తు దారులను రద్దు చేయాలి
నాగర్ కర్నూలు జిల్లా సాక్షిత ప్రతినిధి.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణం లో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల ఓటర్ లిస్ట్ జాబితాలో ఓట్లు ఉన్నగాని మళ్ళీ కల్వకుర్తి పట్టణం లో కొంతమంది రాజకీయనాయకులు వారి రాజకీయ పలుకుబడి ఉందని గ్రామాలలో ఉన్న ఓటర్లను కల్వకుర్తి పట్టనంలో కొత్తగా ఆన్లైన్ దరఖాస్తు చేస్తున్నారు. కానీ కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ దరఖాస్తుదారులు కల్వకుర్తి పట్టణంలో ఎలాంటి చిరునామా అడ్రస్, ఆధార్, ఇంటి పన్ను, కరెంటు బిల్లు. మొదలగునవి ఏవి లేకుండ దరఖాస్తు చేశారు వాటిని ఆన్లైన్లో అప్రూవల్ చేయకూడదు అని కల్వకుర్తి ఆర్డీవో మరియు మున్సిపల్ కమీషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
గత 2019 మున్సిపల్ ఎల్లెక్షన్స్ కు ముందు ఇలాగే ఎలాంటి ఆధారాలు లేకుండా కొంతమంది కల్వకుర్తి కి సంబంధం లేనివారిని ఓట్లు అప్లై చేసి ఓటర్ జాబితాలు పెరువచ్చేవిధంగా చేయించుకున్నారు ఆ వార్డులో ఉన్న వెరిఫికేషన్ ఆఫీసరు పై వారికి ఓటర్ వేరే దగ్గర ఉంది ఇక్కడ ఇవ్వవదు అని రిమర్క్ రాసి ఇచ్చిన గాని దాదాపు 30 మందికి ఓటర్ లిస్ట్ లో పేర్లు వచ్చాయి కాబటి ఈ సారి కూడా 2019 కి ముందులాగా పునావృత కాకూడదని ఎవరికి అయితే పైన చెప్పిన విధంగా అన్ని ఆధారాలు ఉంటేనే ఓటర్ అప్లికేషను అప్రూవల్ చేయాలని కల్వకుర్తి ఆర్డీవో మరియు మున్సిపల్ కమీషనర్ వినతి పత్రం అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో
బండి నారాయణ మూర్తి, ఎడ్ల బాలరాజు, మంద మల్లేష్, నెరటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app