అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన పట్టణ సీఐ పి. కృష్ణయ్య….
సాక్షిత : బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం,
322 గ్రాముల బంగారు ఆభరణాలు,1 కేజీ 350 గ్రాముల వెండి వస్తువులు, ద్విచక్ర వాహనం స్వాధీనం….
మొత్తం స్వాధీనం చేసుకున్న ఆభరణాల విలువ 18.50 లక్షలు…*
కేసు దర్యాప్తు వివరాలను మీడియాకు వెల్లడించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్…
బాపట్ల పట్టణంలో సీఐగా బాధ్యతలు చేపట్టిన నాటినుండి నేటి వరకు పట్టణంలో నేర నియంత్రణ అరికట్టడంలో ప్రత్యేకమైన ప్రతిభ కనబరిచిన,
పట్టణ సీఐ, జిల్లా ఏర్పడిన అనధి కాలంలోనే జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వారి చేతుల మీదగా తొమ్మిది ప్రశంసా పత్రాలు అందుకున్న ప్రథమ స్థానంలో ఉన్న పట్టణ సిఐ పి. కృష్ణయ్య,..
పట్టణంలో మార్చి 6 ఎస్ ఎన్ పి అగ్రహారం, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ రోడ్డు నందు ఒక ఇంటిలో, మార్చి 8న హనుమంతరావు కాలనీ నందు దొంగతనం చేసిన నిందితులను, పట్టణ సిఐపి కృష్ణయ్యకు రాబడిన సమాచారంతో, సోమవారం శొంఠి దుర్గారావు, పులి రమేష్ లను బాపట్ల టౌన్ కంకటపాలెం జిబిసి రోడ్డు నందు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనం చేశామని అంగీకరించారు. ఈ దొంగలను చాకచక్యంగా పట్టుకున్న, పట్టణ సిఐ పి. కృష్ణయ్య, టౌన్ ఎస్ఐ మహమ్మద్ రఫీ లను జిల్లా ఎస్పీ అభినందించారు…