ఇప్పటివరకు పలు కేసుల్లో స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఇక స్టేలు తెచ్చుకునే సీజన్ పోయింది ఆయన పాపం పండింది ఇక ఆయనను కాపాడేవారు ఎవరూ లేరు అని నిజంగా నేడు ఎన్టీ రామారావు ఆత్మ శాంతించిన రోజు అని ప్రభుత్వవిప్ శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు.
జగ్గయ్యపేట పట్టణం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర ప్రభుత్వవిప్,ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు సామినేని ఉదయభాను విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో 550 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడిన ప్రధాన నిందితుడైన చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమమేమి కాదని అత్యంత ఆవశ్యకం అని అన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ విభాగానికి సంబంధించి 550 కోట్ల రూపాయలు స్కామ్ లో ప్రభుత్వానికి 371 కోట్ల రూపాయలు నష్టం కలిగించిన A1 ముద్దాయి చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలైంది అని తెలిపారు.
రాష్ట్రం అప్పుల పాలయింది రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నారు అంటూ బాధ్యతల గురించి మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన 371 కోట్ల రూపాయలు దోచుకు తిన్నట్లు బహిర్గతం అవ్వడం అత్యంత దారుణం అన్నారు.ఇదేనా చంద్రబాబుకు రాష్ట్రం పట్ల ఉన్న బాధ్యత…ఇలా దోచుకుని తినడానికైనా మరల ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలని ప్రజలను మభ్యపెడుతూ వస్తున్నాడు తెలిపారు.ఇప్పటికైనా ప్రజలందరూ ఆలోచించాలని కోరారు.వారి పాపం పండి రాష్ట్రంలో చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ చేస్తున్న అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని వారిని ఎవ్వరు కాపాడలేరని చట్టం తనుపని తాను చేసుకుపోతుందన్నారు.
ఇది కక్ష సాధింపు చర్య కాదు..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబును సిఐడి వారు అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్య కాదని దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని స్కామ్ లో అవినీతి పాల్పడిన దోషులందరినీ అరెస్టు చేయడం సాధారణం అని అన్నారు.వారితో పాటు A1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబును అరెస్టు చేయడం అక్రమేమి కాదు సక్రమమే అని ప్రజాధనాన్ని దోపిడీ చేసిన ఎవరిపైన అయినా చట్టం ఇటువంటి చర్యలే తీసుకుంటుది. ఆశ్చర్యం ఏమీ లేదు అన్నారు. ఇది కేవలం టిడిపి శ్రేణులు సానుభూతి కోసం చేస్తున్న హడావుడి మాత్రమే ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు అని తెలిపారు.