దేశాభివృద్ధిలో ప్రజాభివృద్ధి ఎంతవరకు !?
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటి వరకు అభివృద్ధి చెందిన వారు ఎవరు.? అభివృద్ధి చెందని వారు ఎవరు.? అనేది ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాటి నుండి నేటి వరకు మన జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి సాంకేతికంగా పారిశ్రామికంగా విద్యా పరంగా రవాణా పరంగా అభివృద్ధిని సాధించినప్పటికీ అదే స్థాయిలో రాజకీయరంగంలోనూ యువతలోనూ మానవతా విలువలు నైతిక విలువలు దిగజారి అభివృద్ధికి ప్రశ్నార్ధకంగా మారిపోయాయి
అధికారం ఒక సేవగా భావించాల్సిన రాజకీయ నాయకులు పార్టీలు అధికారం కోసం దిగజారుడు రాజకీయాలు ఓటు బ్యాంకు వాగ్దానాలు అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులు వారు పోగు చేసుకుంటున్నా ఆస్తులు ఎన్నికల్లో వారు పెడుతున్నటువంటి ఖర్చులు చూస్తుంటే సంపద కోసం అధికారం అన్నట్లుగా ప్రవర్తిస్తూ రాజకీయాలను పెడదోవ పట్టిస్తున్నారు. మన దేశ ప్రజా ప్రతినిధులు నాటి నుండి నేటి వరకు వారు అక్రమంగా సంపాదించిన ధనం కొన్ని లక్షల కోట్లకు మించిపోయింది అనేది జగమెరిగిన సత్యం చివరికి మన రాజ్యాంగం ప్రకారం సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేకుండా పోయింది దీనిని అభివృద్ధి అని ఎలా చెప్పుకోగలం? నైతిక విలువల జడ ఎక్కడ?
సమాజంలో రోజురోజుకు దిగజారుతున్న విలువలను పెంచాలన్న విషయాన్ని ఆలోచించకుండా కేవలం అభివృద్ధి గురించే మాట్లాడడం హాస్యాస్పదం
ఉన్నత విద్య కోసం డాక్టర్, ఇంజనీరింగ్, ఉన్నత ఆఫీసర్ విద్య కోసం కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టి చదివిస్తుంటే వారు మాత్రం అంతా సంపాదనై పరమావధిగా విధులు నిర్వహిస్తున్నారు తప్ప సామాన్యుడి సామాజిక స్పృహను మర్చిపోతున్నారు. ఉపాధి కల్పించడంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలోనూ పాలకులు విఫలం అవుతూనే ఉన్నారు దాని ఫలితంగా క్రైమ్ రేటు కూడా అధికంగా పెరిగిపోతున్నది.
సైబర్ నేరాలు చైన్ స్నాచింగ్లు, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు, భూఆక్రమలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ నేరాలలో విద్యావంతులే 80 శాతం ఉండడం ఆశ్చర్యకరం. మన చదువులు సంస్కారాన్ని ఎందుకు పెంచలేకపోతున్నాయో ఆలోచించాలి నేరగాలపై ఎలాంటి చర్యలు ఉండాలి. విద్యావంతులు ఉన్నత విద్యావంతులు ప్రభుత్వ అధికారులు నేరాలకు పాల్పడి రుజువు అయినప్పుడు జైలు శిక్షలే కాకుండా వారి చదువు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో ఆ ఖర్చు అంతా వారి నుండి రాబట్టాలి. త్వరితగతిన వారికి శిక్షలు పడేలా చూడాలి. విద్యా విధానంలో మార్పులు అవసరం
ప్రతి విద్యార్థుల్లోనూ పాఠశాలలో చదువుతున్నప్పటి నుండి చదువుతోపాటు నైతిక విలువలు సామాజిక దృక్పథం జాతీయతా భావాలు చట్టాలకు లోబడి నడుచుకునే విధానం యువతను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాఠశాలలోనే వారికి జాతీయ భావాలు పెంపొందించాలా పాటలు నేర్పాలి. నేరం శిక్షలు అనే విధంగా కాకుండా అసలు నేరాలే చేయనటువంటి విద్యా విధానంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది చట్టాలని ధిక్కరించడంలో రాజకీయ నాయకులే పదవులుగా ఉంటున్నారు నైతిక విలువలు రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటూ దేశాన్ని సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగ విరుద్ధంగాను నైతిక విలువలకు అధికారమే పరమావళిగా భావిస్తూ ఓటు బ్యాంకు కుల రాజకీయాలతో పబ్బం గడుపుకోవడం అధికారం కాపాడుకోవడం కోసం దిగజారుడు రాజకీయాలకు పాల్పోవడం వల్లనే రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు
ఏది నిజమైన అభివృద్ధి!
నాలుగు రోడ్లు నాలుగు ప్రాజెక్టులు రైలు విమానాశ్రయాలు ఓడరేవులు నిర్మించి ఇదే అభివృద్ధి అనుకుంటే పొరపాటు నేడు ఆడపడుచులు పట్టపగలే ఒంటరిగా తిరగలేక పోతున్నారు మెడల మీద నగలతో వీధి ముందు కూడా కూర్చోలేకపోతున్నారు హత్యలు అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు కూడా ఎప్పుడు మాయం అయిపోతాయో తెలియని పరిస్థితి ఊరి నుండి ఇంటికి తిరిగి వచ్చేలోగా ఇంటి తాళం పగిలి ఇంట్లో వస్తువులు ఉంటాయో లేదో తెలియని భయానక పరిస్థితుల్లో ఈ సమాజం భయంతో జీవిస్తున్నాం వీధి వీధికి సీసీ కెమెరాలు అవసరం ఏర్పడింది పోలీస్ అవసరం సమాజం సీసీ కెమెరాలు అవసరంలేని వ్యవస్థను దేశభక్తి జాతీయ భావాల తో కూడిన నైతిక విలువలు గల సమాజాన్ని నిర్మించడమే నిజమైన అభివృద్ధి వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేనిచో ఎంతమంది పోలీసులు ఉన్నా ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నా నేర రైతు మైన సమాజాన్ని నిర్మించడం కష్టమే అభివృద్ధి నైతిక విలువలు సమాన భాగాలుగా విస్తరించినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుంది అనే సత్యాన్ని మనమందరం గ్రహించాల్సిన అవసరం ఉంది పేద మధ్యతరగతి వారి అధికంగా దేనికి ఖర్చు పెడుతున్నారు నిజంగా పేద మధ్య తరగతి వారు మన దేశంలో అభివృద్ధి చెందిన రా దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పుకుంటున్నాం కానీ పేద మధ్య తరగతి వారి ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నదా లేదా అని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
మనదేశంలో 80 శాతం మంది పేద మధ్యతరగతి వారే వీరి అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి ఈ వర్గాల సంపద దేనికోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అని గనుక మనం ఆలోచిస్తే ముఖ్యంగా
మద్యం విద్య ఆరోగ్యం!
మొదటిది మద్యం,;
నేడు గ్రామాలలో మధ్య బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోయినవి సందు గొందుకు బెల్టు షాపులే తమ సంపదలో అధిక శాతం పేద మధ్య తరగతి వారు మద్యానికి ఖర్చు పెడుతున్నారు పండుగలు శుభకార్యాలు మూఢనమ్మకాలతో చేసే కార్యాలు వీటిలో అధిక శాతం మద్యానికి ఖర్చు పెడుతున్నారు మరికొందరు బానిసలుగా మారి కుటుంబం మొత్తాన్ని దివాలా తీపిస్తున్నారు మధ్య మత్తులో గొడవలు పోలీసు కేసులు యువత కూడా మద్యం సేవిస్తూ అధికమైంది కావున పేద మధ్యతరగతి జీవితాలు బాగుపడాలంటే వారి అభివృద్ధి చెందాలంటే మద్యపాన నిషేధం విధించాల్సిందే ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చిన మద్యపానం నిషేధించకుండా పేద మధ్య తరగతి వారి ని అభివృద్ధి చేయడం అసంభవమే విద్య-కొంతమంది పేద మధ్య తరగతి వారు తమ పిల్లల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ పాఠశాలల మీద నమ్మకం లేక ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తూ వేలు లక్షలు నష్టపోతున్నారు వారి సంపద అధిక శాతం పిల్లల ఫీజులకు చెల్లిస్తూ అప్పుల ఫాలో అవుతున్నారు వారిని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్యను అందజేస్తూ ప్రభుత్వ పాఠశాలపై నమ్మకం కుదిరేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలా చేసినట్లయితే మధ్యతరగతి వారిని ఆర్థిక సంపద పెరిగే అవకాశం ఉన్నది
ఆరోగ్యం!- పేద మధ్య తరగతి వారు సరియైన ఆహారం సరియైన ఆహారపు అలవాట్లు లేక పేద మధ్యతరగతి వారు తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నారు ప్రాణభయంతో అప్పులు చేసి ప్రభుత్వ దావకానాలకు వెళ్లకుండా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలు వేలు ఖర్చు పెడుతూ అప్పుల పాలవుతున్నారు ప్రభుత్వ దావకానాలు ఉన్నప్పటికీ అక్కడ సరైన వైద్యం అందక ప్రైవేట్ దావకానా లకు వెళ్తూ నష్టపోతున్నారు కనుక వారిని అభివృద్ధి చేయాలి అంటే ప్రభుత్వ ఆసుపత్రులు మంచి వైద్యం అందేలా ప్రభుత్వ దావకానాలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ దావకానాల్లో వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకొని వారికి ప్రభుత్వ దావకానాలపై నమ్మకం కలిగేలా చేసినట్లయితే పేద మధ్య తరగతి వారు ఆర్థికంగా ఎదిగే అవకాశం కలదు పాలకులకు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి అనుకుంటే మద్యపాన నిషేధం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ప్రభుత్వ దావకానాలలో మంచి వైద్యాన్ని అందేలా చేయడం వీటిని తీర్చిదిద్దినట్లయితే పేద మధ్య తరగతి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం మెండుగా కలదు వీటిని తీర్చిదిద్దకుండా పేదల కోసం ఎన్ని ఉచిత పథకాలు పెట్టిన పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం అసంభవమే : సామాజికవేత్త కుసుమ సిద్దారెడ్డి.