నాలుగోసారి ఏకగ్రీవ ఎన్నికైన టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్….
హ్యూమన్ రైట్స్ ఫోరం, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఘన సన్మానం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
టీఎన్‌జీవో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా బొంకూరి శంకర్ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటలెక్చువల్ ఫోరం, ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్‌లో టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన బొంకూరి శంకర్, జనరల్ సెక్రటరీ సందీప్ రెడ్డిలను వారి చాంబర్‌లో శాలువాలతో సత్కరించి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపట మేమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ అండ్ ఇంటలెక్చువల్ ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు అల్వాల రాజేందర్, ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ జిల్లా అధ్యక్షుడు కలవల మల్లేష్ మాట్లాడుతూ, బొంకూరి శంకర్ నాలుగోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం ఆయనకు ఉద్యోగుల్లో ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పేరుక సత్తన్న, శ్రీధర్, వెంకటేష్, రాకేష్, రాజన్న, అశోక్, రామ్మూర్తి భాస్కర్, రవి తదితరులు పాల్గొన్నారు

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
