కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కీలక అడుగు – బాదురుపల్లి–దూలపల్లి ఫారెస్ట్ రోడ్డును పరిశీలించి, ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి
సాక్షిత : బహదురుపల్లి నుంచి దూలపల్లి వరకు ఉన్న ఫారెస్ట్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను ప్రారంభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు అభివృద్ధి పూర్తయితే పరిసర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభమవుతాయని పేర్కొన్నారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడతామని *నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి * తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ గౌరీష్, మాజీ సర్పంచ్ మైసగిరి శ్రీనివాస్, మన్నె రాజు (చైర్మన్, ఫిషరీస్ – మేడ్చల్ జిల్లా), మాజీ వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, మాజీ కో-ఆప్షన్ మెంబర్ సయ్యద్ రషీర్, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి, ప్రసన్న కుమార్, కుమార్ యాదవ్, సాదు యాదవ్, వేణు, దుద్దు రాహుల్, శివకుమార్ గౌడ్, ప్రశాంత్ కుమార్ గౌడ్, సాయి కుమార్ యాదవ్, పండరీరావు, నరేందర్ (రాజు), మోహన్, మల్లేష్, శ్రవణ్ కుమార్, వెంకటేశ్వరరావు, అకోడే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY