సౌకర్యాల కల్పన మాది, సహకరించాల్సిన భాద్యత మీది…..
–రామగుండం మేయర్ మహంకాళి స్వామి…
సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని:
నగర పాలక సంస్థ తరపున ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని,ప్రజలు కూడా తమ వంతు భాధ్యతగా చెత్త బయట పడవేయకుండా నగరపాలక సంస్థకు సహకరించాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు.
వార్డు బాటలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థ మూడవ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ , వినాయక నగర్, దొడ్డి కొమురయ్య నగర్ , శ్రీ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వడ్లూరి రవి , అధికారులతో కలిసి ఆయన పర్యటించారు. కార్పొరేటర్ తో పాటు స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఆయన ఆదేశాల మేరకు నగర పాలక సంస్థ అధికారులు సానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి జి సి బి , చైన్ జి సి బి , బాబ్ కాట్ యంత్రాలతో పెద్ద మురుగు నీటి కాలువలో పూడిక తొలగించారు.
మేయర్ కాలువ గట్టు పై నుండి అధికారులకు ,సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. పని పూర్తయిన తరువాతనే అక్కడి నుండి వెళ్లాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నగర పాలక సంస్థ , పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ , ట్రాన్స్ కో తదితర ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి వాడ వాడలా తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ, వారి సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
తమ ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని చెప్పిన వెంటనే అప్పటికప్పుడే అక్కడిక్కడే వీధి దీపాలు పెట్టించారు. సుమారు 10 వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నారు. తమ డివిజన్ కు మంచి నీళ్ళు రావడం లేదని స్థానికులు ఫిర్యాదు చేయగా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా చేపట్టిన పనుల్లో వేగం పెంచాలని అన్నారు. ఇండ్ల మీద వేలాడుతున్న కరెంట్ తీగలను సవరించాలని, ట్రాన్స్ కో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అభివృద్ది పనులు నిర్వహించడంలో అధికారులకు సమస్యలు తలెత్తితే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. స్థానికంగా ఉన్న హోటళ్ల నిర్వాహకులు కాలువల్లో చెత్త పడవేస్తున్నారని ఫిర్యాదు చేయగా తక్షణమే వారికి నోటీసులు అందజేసి జరిమానా విధించాలని ఆదేశించారు. రోడ్ల మీద , కాలువల్లో చెత్త వేసినా వాటిని ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
కాగా తమ డివిజన్ లో పర్యటిస్తున్న సంధర్భంగా కాలనీ వాసులు ఆయనకు ఘనంగా స్వాగతం పలుకుతూ శాలువాలు , బొకే లకు బదులుగా నోటు పుస్తకాలు , విద్యార్థులకు ఉపకరించే వస్తువులను అందజేయడంతో వారిని ఆయన అభినందించారు. స్థానిక కార్పొరేటర్ వడ్లూరి రవి , స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు , ప్రశాంత్ నగర్ పెద్ద మనుషులు , శ్రీ నగర్ కాలనీ వైభవ్ టవర్స్ తరపున వెంకట్రావ్ , కాలనీ వాసులు భూపెల్లి శ్రీనివాస్ రావు , శ్రీ నగర వెల్ఫేర్ అసిసియేషన్ తరపున ప్రభాకర్ రావు, మాజీ ఆర్ పి త్రివేణి , కె వి ఆర్ వెజిటేబుల్స్ తరపున పది లాంగ్ నోట్ పుస్తకాలు వేర్వేరుగా అందజేయగా వినాయక నగర్ కాలనీ వాసుల తరపున నరేందర్ కలర్ చాక్ పీసులు మేయర్ కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లతో పాటు నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి , ఎస్ ఇ గురువీర , ఇ ఇ పి వి రామన్ , డి ఇ ఇ లు అఫ్తాబ్, జగదీష్ , షాభాజ్ , ఎ ఇ లు జమీల్, మీర్, మనోజ్ , చంద్ర మౌళి , రాంజీ , పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు మౌనిక , కిషోర్ , టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , సానిటరీ ఇన్స్పెక్టర్ లు నాగ భూషణం ,సంపత్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY