నకిరేకల్ నియోజకవర్గం :- చిట్యాల మున్సిపాలిటి ను కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సందర్భంగా గెలుపొందిన మున్సిపాలిటీ కౌన్సిలర్లను సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చిట్యాల పట్టణ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. మున్సిపాలిటీలో ప్రతి వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రోడ్ల నిర్మాణం వంటి పనులను ప్రాధాన్యతగా చేపడతామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజార్టీ అందించిన చిట్యాల పట్టణ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
