రూ1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Sakshitha news

రూ1.83 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కుత్బుల్లాపూర్‌లో అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట: కూన శ్రీశైలం గౌడ్

దుండిగల్ సర్కిల్ పరిధిలోని గండి మైసమ్మలో ఉన్న రాజరాజేశ్వర కాలనీ లో రూ.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం, రూ.63 లక్షలతో చేపట్టనున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు కుత్బుల్లాపూర్ మాజీ శాసనసభ్యులు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

అదేవిధంగా శ్రీనివాస్ నగర్ కాలనీలో రూ.30 లక్షలతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, మొత్తంగా రూ.1.83 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కోరిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని తెలిపారు.

ఈ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తోందని శ్రీశైలం గౌడ్ పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్నబియ్యం పంపిణీ, ఉచిత విద్యుత్ తదితర పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలుగుతోందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరీ శ్రీనివాస్ రెడ్డి , జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి , మాజీ కౌన్సిలర్ రాము గౌడ్, డిసిసి వైస్ ప్రెసిడెంట్ ముత్యం రెడ్డి, యాదవ రెడ్డి, దుండిగల్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, సదానందం, తిరుపతి రెడ్డి మరియు స్థానిక కాలనీల అధ్యక్షులు రాజిరెడ్డి, మోహన్ రెడ్డి లతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Scroll to Top